తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్; జగ్గారెడ్డి సతీమణికి అవకాశం; పోటీ ఈ స్థానాల్లోనే!!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ తో తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు నామినేషన్ల చివరి రోజు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి, నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగింది.

 రెండే స్థానాల్లో ఎన్నికల బరిలోకి కాంగ్రెస్

రెండే స్థానాల్లో ఎన్నికల బరిలోకి కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ దుబ్బాక, జిహెచ్ఎంసి, హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగాలా వద్దా? అన్న సంశయం నుండి బయటకు వచ్చింది. ముఖ్య నేతలతో సమావేశమైన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటి 12 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నా, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేవలం రెండు స్థానాల నుండి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దించనున్నారు.

జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి, ఖమ్మం నుండి రాయల్ నాగేశ్వరరావుకు బీ ఫామ్స్

జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి, ఖమ్మం నుండి రాయల్ నాగేశ్వరరావుకు బీ ఫామ్స్

ఈ క్రమంలో ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి రాయల్ నాగేశ్వరరావుకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీ ఫామ్ అందజేశారు. అంతేకాకుండా మెదక్ నుండి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ దక్కింది. ఇక నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ల మధ్య ఇంకా సయోధ్య కుదరకపోవడంతో ఆ స్థానంలో ఇంకా స్పష్టత రాలేదు. నిజామాబాద్, వరంగల్ లోనూ పోటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ పోటీ చేయడం కోసం కాంగ్రెస్ నేతలు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం.

తగిన సంఖ్యా బలం లేని కారణంగా మిగతా చోట్ల పోటీ చెయ్యని కాంగ్రెస్

తగిన సంఖ్యా బలం లేని కారణంగా మిగతా చోట్ల పోటీ చెయ్యని కాంగ్రెస్

తగిన సంఖ్యా బలం లేని కారణంగా మిగతా చోట్ల అభ్యర్థులను నిలపవద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా బరిలో ఉంటే వారికి మద్దతు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసిసి పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం, డిసిసి అధ్యక్షులతో మాట్లాడిన తరువాత తెలంగాణ పిసిసి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ ఎన్నికలకు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా రెండు చోట్ల మాత్రమే బరిలోకి దిగనున్నారని సమాచారం.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల నామినేషన్లు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల నామినేషన్లు

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కాగా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆరుగురు పాత వారికి, ఆరుగురు కొత్తవారికి అవకాశం కల్పించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రంగారెడ్డి జిల్లా నుండి పట్నం మహేందర్ రెడ్డి కి, వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి, మహబూబ్ నగర్ నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి కి, కరీంనగర్ నుండి భానుప్రసాద్ రావు కు, నిజామాబాద్ నుండి కవిత కు, రంగారెడ్డి జిల్లా నుండి శంభీపూర్ రాజుకు ఆరుగురు పాతవారికి అవకాశం ఇచ్చారు.

కొత్తవారికి ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్, పోటీ నుండి బీజేపీ దూరం

కొత్తవారికి ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్, పోటీ నుండి బీజేపీ దూరం

అలాగే మహబూబ్ నగర్ నుండి గాయకుడు సాయి చంద్ కు, కరీంనగర్ నుండి ఎల్.రమణ కు, నల్లగొండ నుండి ఎంసి కోటిరెడ్డి కి, ఆదిలాబాద్ నుండి దండే విఠల్ కు, ఖమ్మం నుండి తాతా మధుకు, మెదక్ నుండి డాక్టర్ యాదవ రెడ్డికి అవకాశం కల్పించారు. ఇందులో ఇప్పటికే చాలా మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఈ రోజు చివరి రోజు కావడంతో కవితతో సహా మిగతా వారంతా నామినేషన్లను దాఖలు చేయనున్నారు.ఈ రోజు నామినేషన్ల పర్వం పూర్తి కానుండగా చివరిరోజు హడావిడి కొనసాగుతుంది. ఇదిలా ఉంటే సంఖ్యాబలం లేని కారణంగా బీజేపే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+