Jubilee hills: మారుతున్న అంచనాలు, పెరుగుతున్న ఉత్కంఠ - తాజా ట్రెండ్స్..!!
జూబ్లీహిల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు మూడు రౌండ్ల లెక్కింపు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎంల కౌంటింగ్ వరకు కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు పోలైయ్యాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కే మెజార్టీ దక్కింది. షేక్ పేట పరిధిలో తొలి రెండు రౌండ్లు లెక్కింపు జరిగింది. అక్కడ కాంగ్రెస్ భారీ మెజార్టీ పైన ఆశలు పెట్టుకో గా.. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇక.. ఇప్పుడు మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ మూడు వేలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.
జూబ్లీహిల్స్ కౌంటింగ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం పది రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. ఎంఐఎం కంచుకోటల్లోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది దీంతో, చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్-39, బీఆర్ఎస్ -36, బీజేపీ-10 ఓట్లు వచ్చాయి. ఈవీఎంల కౌటింగ్ లో ముందుగా షేక్‌పేట్ డివిజన్‌తో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కాగా, ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్ధి స్వల్ప మెజార్టీతో కొనసాగుతున్నారు.

తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 8,911 ఓట్లు బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి. కాగా.. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు వచ్చాయి. దీంతో, రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్ధి 1,144 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. షేక్ పేట ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు పూర్తి మద్దతు లభించింది. పోలింగ్ వేళ సరళి అదే స్పష్టం చేసింది. అయితే, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక, ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్‌లో 10 బూత్స్, వెంగళరావు డివిజన్‌లో 4, సోమాజీగూడ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కింపు జరిగింది. ఈ డివిజన్లలో కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ నవీన్ కు స్థానికంగా బలం ఉండటంతో.. ఏకపక్షంగా మెజార్టీ సాధిస్తామని భావించింది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ కు 1200 వరకు ఓట్ల మెజార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. కాంగ్రెస్ ఆధిక్యత 3 వేల ఓట్ల కు పైగా చేరింది. మూడో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ రెండు వేల కోట్ల కు పైగా మెజార్టీ వస్తుందని ఆశించింది.
ఇక.. బీఆర్ఎస్ మిగిలిన ఏడు రౌండ్లలో ఒక్క దాంట్లో అయినా రెండు వేలకు పైగా మెజార్టీ సాధిస్తే తుది ఫలితం పైన ఆశలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక.. ఇప్పుడు నాలుగో రౌండ్ కౌంటింగ్ ప్రాంతాలు కాంగ్రెస్ - బీఆర్ఎస్ హోరా హోరీగా తలపడ్డాయి. దీంతో.. ఇక నుంచి కొనసాగే రౌండ్లలో రెండు పార్టీల్లో ఎవరు ఏ మేర ఓట్లు సాధిస్తారనేది ఉత్కంఠగా మారుతోంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications