Rythu Runa Mafi: రైతులకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. అయితే హామీల అమలులో మాత్రం ప్రభుత్వం వెనకబడుతుంది. రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. చాలా మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగో విడత రుణ మాఫీ ప్రకటించినప్పటికీ ఇంకా చాలా మంది అన్నదాతలు మిగిలిపోయారు. ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపుతూ అన్నదాతలకు రుణాలు మాఫీ చేయడం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడ దశల్లో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. మొదటి దశలో రూ.లక్ష వరకు రుణ మాఫీ చేశారు. రెండో దఫాలో రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ చేశారు. మూడో దశలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశారు. అయితే సగం మంది రైతులకు రుణ మాఫీ చేయలేదు. దీనిపై ప్రభుత్వం సాంకేతిక కారణాల వల్ల రుణ మాఫీ చేయలేదని ప్రకటించింది. త్వరలోనే అధికారులు రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపింది.

కానీ రైతుల వద్ద అధికారులు వెళ్ల లేదు. చాలా మంది రైతులు సాంకేతిక తప్పిదాలను సరి చేసుకున్నారు. అయినప్పటికీ అధికారులు వారి వివరాలు తీసుకోలేదు. దీంతో నాలుగో విడత కూడా అన్నదాతలకు నిరాశే మిగిలింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన రైతు చెక్కిల్ల లచ్చయ్యకు బెజ్జంకి మండలం తోటపెల్లిలో ఇండియన్ బ్యాంకులో క్రాఫ్ లోన్ తీసుకున్నారు. అయితే బ్యాంక్ క్రాఫ్ లోన్ పాస్ బుక్ పేరులోని ఒక అక్షరం తప్పుంది. దీంతో మూడో విడతలో ఆయనకు రుణ మాఫీ కాలేదు.
పాస్ బుక్ లో Chekkilla Latchaiah అని ఉంది. ఆధార్ లో Chekkilla Lachaiah అని ఉంది. పాస్ బుక్ లో T అనే అక్షరం ఎక్కవ ఉందని రుణ మాఫీ కాలేదు. దీంతో రైతు లచ్చయ్య 2024, ఆగస్ట్ 31 బ్యాంకుకు వెళ్లి పేరును సరిచేసుకున్నాడు. తాజాగా నాలుగో విడత రుణ మాఫీలో కూడా రుణం మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులను సంప్రదించగా.. పాస్ బుక్, ఆధార్ లో పేరు తేడా ఉందని చెప్పారని వివరించారు. తాను బ్యాంక్ పాస్ బుక్ లో పేరు సరి చేసుకున్నట్లు చెప్పినా.. అధికారులు తమకు తెలియదని.. బ్యాంకుకు వెళ్లాలని చెప్పినట్లు వాపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇదే ఆధార్, ఇదే బ్యాంక్ పాక్ ఉన్నప్పుడు రుణ మాఫీ అయిందని అన్నదాత లచ్చయ్య గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications