మునుగోడులో ఎదురీదుతున్న కాంగ్రెస్.. ఆ కీలకనేతల తీరుతో పాల్వాయికి స్రవంతికి టెన్షన్!!

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ కు కారణంగా మారింది. మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంలో వెనుకబడింది అన్ని టాక్ స్థానికంగా వినిపిస్తుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ తో ఎన్నికల ప్రచారం సాగించటం లేదన్న చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది.

మునుగోడులో ఎదురీదుతున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

మునుగోడులో ఎదురీదుతున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

మునుగోడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావటంతో ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడు ఉప పోరులో ఎదురీదుతున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారానికి 38 మంది నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించి ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయం తీసుకున్నా, పార్టీ కోసం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలు కనిపించటం లేదు. పార్టీలో కలిసి వచ్చే వారు ఎవరు అన్నది తేల్చుకోలేకపోతున్న పాల్వాయి స్రవంతి ఈ ఎన్నికలో ఎలా గట్టెక్కాలి అని తెగ మధనపడుతున్నారని సమాచారం.

క్షేత్ర స్థాయిలో పని చెయ్యని కాంగ్రెస్ నేతలు

క్షేత్ర స్థాయిలో పని చెయ్యని కాంగ్రెస్ నేతలు

మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్, బిజెపి నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మినహాయించి మునుగోడు నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం చేస్తున్న నేతలు కనిపించడం లేదు. మండలాల ఇన్చార్జిగా సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎవరు క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పని చేస్తున్న దాఖలాలు లేవు .ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఉప ఎన్నికల ప్రచారంలో వెనక్కినెట్టాయి.

 కీలక నేతలు బాధ్యులుగా ఉన్నా ప్రచారంలో జీరోగా మారుతున్న కాంగ్రెస్

కీలక నేతలు బాధ్యులుగా ఉన్నా ప్రచారంలో జీరోగా మారుతున్న కాంగ్రెస్

మన మునుగోడు మన కాంగ్రెస్ అంటూ గడపగడపకు ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. మునుగోడు నియోజకవర్గంలో బూత్ స్థాయి సమన్వయకర్తలుగా, క్లస్టర్ ఇన్చార్జ్ లుగా మండలానికి సీనియర్ నేతలను బాధ్యులుగా నియమించినప్పటికీ ఆ దిశగా ప్రచారంలో జోష్ కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వి.హనుమంతరావు, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు మండలాల ఇన్చార్జిలుగా ఉన్నప్పటికీ వారు క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా పని చేయడం లేదన్న టాక్ వినిపిస్తుంది.

పాల్వాయి స్రవంతికి పెద్ద కష్టం .. కాంగ్రెస్ పరిస్థితి ఇలా

పాల్వాయి స్రవంతికి పెద్ద కష్టం .. కాంగ్రెస్ పరిస్థితి ఇలా

ఇక పార్టీ నేతల తీరుతో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్వాయి స్రవంతి పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటుంది.
ఇక నల్గొండ జిల్లా కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నిక ప్రచారంలో పాల్గొనటం లేదు. ఎన్నికల ప్రచారంలో బాధ్యుడుగా ఉన్న పల్లె రవి కుమార్ టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక మునుగోడులో ధన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో డబ్బులు ఖర్చు పెట్టలేక కొందరు నేతలు ముఖం చాటేస్తున్నారని సమాచారం. ఇక ఈ నెల 23 నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో ఉండనుండటంతో కీలక నాయకుల దృష్టి రాహుల్ పాదయాత్రపై ఉంది. దీంతో మునుగోడును లైట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురవుతున్న కాంగ్రెస్

ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి గురవుతున్న కాంగ్రెస్

ఇక దిక్కుతోచని స్థితిలో ఉన్న పాల్వాయి స్రవంతి తానే గ్రామ గ్రామాన ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజల వద్ద భావోద్వేగానికి గురవుతున్నారు. తండ్రిని గుర్తు చేసుకుని పాల్వాయి స్రవంతి కన్నీరు పెట్టుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డను వచ్చాను.. ఒకసారి నన్ను గుర్తుంచుకోండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగకుంటే కాంగ్రెస్ మునుగోడులో చావు దెబ్బ తినే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+