కెసిఆర్ పదవి: డి శ్రీనివాస్‌ను హైకోర్టుకు లాగిన గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించబడిన డి శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి కోర్టుకు లాగారు.
గుత్తా పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల పార్టీలో చేరిన డి శ్రీనివాస్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ సలహాదారు (అంతర్యుద్దం) పదవిని ఇచ్చారు. దీంతో, గుత్తా కోర్టుకు ఎక్కారు.
తెలంగాణ అతని జాగీరు కాదు: పొన్నం

రాష్ట్రాన్ని ఇష్టానుసారం పాలించాలని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును హెచ్చరించారు.
తెలంగాణలోని ప్రాజెక్టులన్నింటినీ రీడిజైన్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, ఇదేమైనా ఆయన సొంత సామ్రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను రీడిజైన్ చేసే అంశంపై విపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని కేసీఆర్ మండిపడటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇష్టానుసారం డిజైన్లు మారిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదన్నారు.












Click it and Unblock the Notifications