వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు భవితను మృగ్యం చేస్తున్నారు.!కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై భగ్గుమన్న కాంగ్రెస్ నేత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఓటమి నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొత్త డ్రామాలకు తెర తీశారని టిపిసిసి సీనియర్ ఉపాద్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అరోపించారు. రైతులు పండించిన పంటను ప్రతి సారి రాష్ట్ర ప్రభుత్వమే ఐకెపి సెంటర్ల ద్వార కొనుకొగు చేసి రైస్ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్ సీఐ కి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుండి రీఎంబర్సమెంట్ ద్వారా డబ్బులు తీసుకొనే అనవాయితీ ఉందన్నారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు అందుకు విరుద్దంగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వ విదానాలు కారణం కాదా అని ప్రశ్నించారు మల్లు రవి. అంతే కాకుండా అధికారంలో ఉండి రాజకీయ లబ్ది కొసం ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజులని అన్నారు. వరి పంట కొనుగొలు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు నాల్కల దొరణి ప్రదర్శిస్తున్నారని మల్లు రవి మండిపడ్డారు.

Congress leader lashes out at central and state governments.!

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS

గతంలో శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాతుతూ వరి పంట విషయంలో భయం వద్దని చెప్పి, మొన్న విలేఖరుల సమావేశంలో నిర్మొహమాటంగా వరి వేయవద్దని చెప్పడం ముఖ్యమంత్రి ద్వంద వైఖరికి నిదర్శనం కాదా అని మల్లు రవి ప్రశ్నించారు. రాజకీయ లబ్ది నాటకాలు పక్కన పెట్టి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా రైతు పండించిన ప్రతి పటను కొనుగొలు చేసే విధంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మల్లు రవి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని ఒకరు సహకరించుకునే అంశంలో భాగంగా అవసరమున్నప్పుడు బిల్లులకు సహకరించుకుంటారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రైస్ మిల్లర్లు ధాన్యం రాకుండానే ట్రక్ షీట్లతో ధాన్యం వచ్చినట్లు రాసుకొని వారి బినామీ వ్యక్తుల అకౌంట్లలో డబ్బలు జమచేసుకొని పంచుకుంటున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకొవడం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బాద్యులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

English summary
Mallu Ravi demanded that a comprehensive farming system be introduced so that the farmer can buy every map he harvests. He was incensed that the central and state governments were cooperating with each other on bills when needed as part of the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X