ముఖం చెక్కి, మర్మాంగం కోసి కాంగ్రెసు నేత దారుణ హత్య
కరీంనగర్: తెలగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో దారుణ హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాంగ్రెసు రాష్ట్ర నాయకుడు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖం చెక్కేసి, మర్మాంగం కోసి ఆయనను దుండగులు హత్య చేశారు. ఇప్పటి వరకు గుర్తు తెలియని మృతదేహమేనని అంతా అనుకున్నారు.
అయితే, ఆ గుర్తు తెలియని శవం కాంగ్రెస్ నేత దార వీరాస్వామిదనే విషయం తెలియడంతో సర్వత్రా ఆశ్చర్యం చోటు చేసుకుంది. గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దార వీరాస్వామి (57) మార్కండేయ కాలనీ సమీపంలోని దుర్గా నగర్‌లో హత్యకు గురైన విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

గోదావరిఖని పోలీసుల వివరాల ప్రకారం... దార వీరాస్వామి భార్య రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం జనగామ ప్రాంతానికి చెందిన ఓ భూ వివాదం కేసులో కొద్ది రోజులుగా చాప కింద నీరులా జరుగుతున్న వ్యవహారం ఈ హత్యకు దారి తీసిన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భూ వివాదాల వ్యవహారంతో జరిగిన హత్యగా ప్రచారం జరుగుతున్నప్పటికీ మర్మాంగం కోసి ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. గోదావరిఖని సబ్ డివిజన్ ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్, సి ఐ ఆరె వెంకటేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయమై పూర్తి స్థాయిలో వివరాలను ఆరా తీస్తున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications