Telangana Elections: కాంగ్రెస్‍కు షాక్.. పార్టీని వీడనున్న నాగం జనార్ధన్ రెడ్డి..!
మహబూబ్ నగర్ కాంగ్రెస్ గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నారు. ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. నాగం మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. ఆదివారం సాయింత్రం మంత్రి కేటీఆర్ నాగం జనార్ధన్ రెడ్డికి వెళ్లనున్నారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారు. జనార్ధన్ రెడ్డి త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
నాగర్ కర్నూల్ టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం రాజేశ్ రెడ్డికి కేటాయించింది. అప్పటి నుంచి నాగం అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ లో టికెట్ రాని వారు బీఆర్ఎస్ లోకి.. బీఆర్ఎస్ లో టికెట్ రాని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఆ పార్టీలు వీడారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. పటాన్ చెరుకు సంబంధించి బీఆర్ఎస్ నేతు నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు.

ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు. పటాన్ చెరు స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. బండి రమేష్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ ఆయనకు కూకట్ పల్లి సీట్ కేటాయించింది. ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది.
దీంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆయన సోదరి విజయరెడ్డికి మాత్రం ఖైరతాబాద్ నుంచి టికెట్ కేటాయించింది. అందుకు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదని సమాచారం.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications