కాంగ్రెస్ నేతను వేట కొడవళ్లతో నరికి చంపారు, పాత పగలే కారణమా?
కాంగ్రెస్ పార్టీ నేత పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ నేత పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని హోటల్‌కు టిఫిన్ చేసేందుకు వచ్చారు.

అదే సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసరావుపై తమ వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రే కొట్టారు. దీంతో అప్రమత్తమైన శ్రీనివాసరావు అక్కడి నుంచి పరుగులు తీస్తుండగా దుండగులు వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గతంలో శ్రీనివాసరావుపై హత్యాప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications