వారికో న్యాయం కోదండరామ్‌కో న్యాయమా?: వి.హనుమంతరావు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డబ్బుల సంపాదించేందుకు సినిమాల వారికి స్టేడియాల్లో కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నప్పుడు తెలంగాణ సాధన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ జెఎసీ ఛైర్మెన్ కోదండరామ్ పార్టీ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు.

మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ పాలనలో అన్యాయానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. . తెలంగాణకు దళితుడినే సీఎంను చేస్తానని ఇచ్చిన హమీని కెసిఆర్ తుంగలో తొక్కారని ఆయన విమర్శలు గుప్పించారు.

Congress leader V. Hanmumatha Rao demands to KCR to permit Kodandaram sabha

తెలంగాణ సాధనలో భాగస్వామ్యులుగా ఉన్నవారిని కెసిఆర్ దూరం పెట్టారని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనలో ప్రోఫెసర్ కోదండరామ్ పాత్రను ఎవరూ కూడ మరువలేరని ఆయన చెప్పారు. కోదండరామ్ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి సభ ఆవిర్భావ సభకు ఎందుకు అనుమతివ్వరని ఆయన ప్రశ్నించారు.

డబ్బుల కోసం సినిమాలకు చెందిన కార్యక్రమాలకు స్టేడియాలను ఇస్తున్నారని, అలాంటిది కోదండరామ్ సభకు ఎందుకు అనుమతివ్వరని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పాలన అంతిమ దశకు చేరుకొందని హనుమంతరావు చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ అన్యాయం జరిగినా తనకు ప్రశ్నించే హక్కుందన్నారు. కోదండరామ్ ఏర్పాటు చేసే సభకు ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress party senior leader V. Hanumantha Rao demanded to KCR to permit Kodandaram sabha. He spoke to media on Tuesday at hyderabad

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి