సీఎంగా రేవంత్ కే ఛాన్స్, అదొక్కటే మైనస్ - హైకమాండ్ లెక్క ఇదే..!!

తెలంగాణలో మరి కొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మెజారర్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ తమదే గెలుపని ఇప్పటికీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలోనే హంగ్ అవకాశాల పైన చర్చ సాగుతంది. దీంతో, కాంగ్రెస్ నాయకత్వం అలర్ట్ అయింది. ఇటు కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా రేవంత్ కు ఛాన్స్ ఇస్తారా..ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చగా మారుతోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం సీఎం పదవిపై హైకమాండ్ మూడ్ ఏంటో స్పష్టం చేస్తున్నారు.

రేవంత్ కు నేతల మద్దతు : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో, కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంటకి క్యూ కడుతున్నారు. డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని , రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. 70-80 సీట్లలో విజయం సాధించనున్నామని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలంతా రేవంత్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని, ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయని, కానీ, సీఎం అయ్యే అవకాశాలు రేవంత్‌కే అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కష్టపడ్డ వారే సీఎం అవుతారని, ఎవరు కష్టపడ్డారో అందరికీ తెలుసని మల్‌రెడ్డి రంగారెడ్డి చెప్పుకొచ్చారు.

Congress leaders appreciates Revanth efforts in Assembly Elections, will he get CM Chance

పార్టీ నిర్ణయమే ఫైనల్ : ఇటు రేవంత్ సైతం సీఎం పదవి పైనా ఒక జాతీయ ఛానల్ తో స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి ఎవ రిని ఎంపిక చేయాలనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో గెలిచే 80కిపైగా ఎమ్మెల్యేల అభిప్రాయం అనంతరం పార్టీ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్‌ ఇక ఫామ్‌హౌస్ కు, కేటీఆర్‌ అమెరికాకు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజీనామాలపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయినా.. ఆ తర్వాత కూడా ప్రగతి భవన్‌కు వెళ్లబోనని, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటానని వ్యాఖ్యానించారు. తనకు ఎవరితోనైనా పోటీ ఉంటే అది కే సీఆర్‌, బండి సంజయ్‌ వంటి వారితోనేనని స్పష్టం చేశారు.

Congress leaders appreciates Revanth efforts in Assembly Elections, will he get CM Chance

హైకమాండ్ ఆలోచన క్లియర్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా ఉన్నా..పార్టీ హైకమాండ్ అలర్ట్ అవుతోంది. మెజార్టీ సీట్లకు ఏమైనా తక్కవ వస్తే ఏం చేయాలో ఇప్పటికే కార్యాచరణ డిసైడ్ చేసింది. డీకే శివకుమార్ హైదరాబాద్ లో మకాం వేస్తున్నారు. రేవంత్ ను సీఎం చేయాలంటే ఎప్పుడూ మంత్రిగా పని చేసిన లనుభవం..ప్రభుత్వ నిర్వహణ కొత్త కావటంలో ఇచ్చిన హామీల అమలు..పాలనా వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయనే చర్చ పార్టలో వినిపిస్తోంది. ఇదే సమయంలొ త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో పట్టు కొనసాగించాలంటే రేవంత్ పార్టీని ముందుకు నడిపించటం అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. దీంతో..పార్టీకి వచ్చే సీట్లు..ప్రత్యర్ధి పార్టీల బలం..బీజేపీ ఓటింగ్ శాతం..సామాజిక వర్గాల మద్దతు పరిగణలోకి తీసుకొని సీఎం అభ్యర్ది పై నిర్ణయం ఉంటుందని పార్టీ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+