కరోనా రూల్స్ కాంగ్రెస్‌కేనా ? .. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలోనూ దోస్తీ.. కేసీఆర్ సర్కార్‌పై హస్తం నేతలు ఫైర్
తెలంగాణ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నాయని విమర్శించారు. కరోనా నింబధనలు కేవలం కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయా.. ఆరెండు పార్టీలకు వర్తించవా ? అని డీజీపీని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లో లేదని పర్మిషన్ ఇవ్వారా అని నిలదీశారు. టీఆర్ఎస్, బీజీపీలు మధ్య దోస్తీ గతంలో ఢిల్లీ స్థాయిలో ఉంటే ఇప్పుడు గల్లీ స్థాయిలోనూ దోస్తీ కట్టారని సెటైర్లు వేశారు.

ఢిల్లీ దోస్తీ.. ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీనేనా?
కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. జనవరి 9 నుంచి 11 వరకు శిక్షణా తరగతుల కోసం కాంగ్రెస్ పార్టీ అనుమతి కోరితే.. ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. తాము కేవలం 120 మందితో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని చెప్పినా పర్మిషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ, 300 మందితో నిర్వహించే ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాలకు మాత్రం అనుమతి ఇచ్చిందని ఠాకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు . ఇదేం ద్వందనీతి అని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఢిల్లీ దోస్తీ.. ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీనేనా అని టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పవర్ లో లేదని పర్మిషన్ ఇవ్వారా?
పోలీసుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెండ్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు వారు తొత్తులుగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కరోనా నిబంధలు కేవలం కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయనా అని రాష్ట్ర డీజీపీని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ర్యాలీలకు, సభలకు పర్మిషన్లు ఇస్తున్నప్పుడు , కాంగ్రెస్‌కి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలో లేదని పర్మిషన్ ఇవ్వరా..? అని డీజీపీపై మండిపడ్డారు. కేవలం 120 మందితో మూడు రోజుల పాటు కాంగ్రెస్ శిక్షణ శిబిరాల నిర్వహణ కోసం అనుమతి కోరితే పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఎక్కడా కరోనా నిబంధనలు పాటించడంలేదని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.

ఇదేం ద్వంద నీతి..
హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహించింది. దీనికి 300 మందితో మాత్రమే నిర్వహించుకోవాలని షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. శంషాబాద్ నుంచి భారీ ర్యాలీ కూడా బీజేపీ కార్యకర్తలు నిర్వహించారు . తొలుత నడ్డా ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు తర్వాత అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా.. బీజేపీ కార్యక్రమాలకు మాత్రం పర్మిషన్ ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఢిల్లీ దోస్తీ.. గల్లీలో కుస్తీ అనేదాన్ని ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీనా అని విమర్శలు గుప్పిస్తున్నారు.

జగ్గారెడ్డి నిరాహార దీక్షకు అనుమతి ఇస్తారా...?
లే అవుట్లు , ఇళ్లను కమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. పేద ప్రజలపై కేసీఆర్ సర్కార్ కక్ష కట్టిందని మండిపడ్డారు. గ్రామాల్లో పేదలు కట్టుకున్న ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరారు. లక్షల రూపాయాలు అప్పుచేసి ప్రజలు నిర్మించుకుంటున్న వాటిని కూల్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి జగ్గారెడ్డి తలపెట్టిన దీక్షకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి..












Click it and Unblock the Notifications