టీడీపీ పరిస్థితిని చూపించి టీఆర్ఎస్ కు అదే గతి పడుతుంది అంటున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణా సీఎం కేసీఆర్ కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి పట్టిన గతే భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు పట్టబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ఇది భవిష్యత్ టీఆర్ ఎస్ పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు విజయశాంతి.

టీఆర్ఎస్ పార్టీ కి భవిష్యత్ లో టీడీపీ గతే పడుతుందన్న షబ్బీర్ అలీ
దేశంలోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ బీజేపీ క్రమంగా తనవైపుకు తిప్పుకుంటుందని , ప్రలోభాలకు గురి చేస్తుందని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ కు మహారాష్ట్రలో శివసేన, బీహార్‌లో జేడీఎస్, ఏపీలో టీడీపీకి పట్టిన గతే తెలంగాణలో టీఆర్ఎస్‌కూ పడుతుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ, బీజేపీలను ఓ కంటకనిపెడుతూ ఉండాలని కేసీఆర్‌కు షబ్బీర్ సూచించారు.ఏపీలో టీడీపీకి పట్టిన గతే భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు పడుతుందన్నారు.
Recommended Video


ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ లాగా టీఆర్ఎస్ కూడా భవిష్యత్ లో చావు దెబ్బ తింటుందన్న షబ్బీర్ అలీ
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది. ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ నుండి వలసలు ప్రారంభం అయ్యాయి. తాజాగా టీడీపీ రాజ్య సభ సభ్యులు నలుగురు టీడీపీ నుండి పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. ఇక ఏపీలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయిమ్పులకు ప్రోత్సహించారు. ఇక ఇప్పుడు చంద్రబాబును దెబ్బ కొడుతూ బీజేపీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంది . ఇక నేపధ్యంలోనే నేడు టీడీపీకి పట్టిన గతే రేపు తెలంగాణలో టీఆర్ఎస్‌కు పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులు బీజేపీలో చేరడాన్ని ఉద్దేశించి షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ తాజా పరిస్థితి టీఆర్ఎస్ కు భవిష్యత్ సంకేతం అన్న విజయశాంతి
విజయశాంతి కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిస్థితి చూస్తే భవిష్యత్ లో తెలంగాణాలోనూ అలాంటి పరిస్థితే రిపీట్ అవుతుందనే భావన కలుగుతుంది అని పేర్కొన్నారు . తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారక కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీలోని పరిణామాలు తెలంగాణలోని టీఆర్ఎస్ కు భవిష్యత్ సంకేతంగా ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె రెండు ప్రాంతీయ పార్టీలు సమర్థవంతమైనవి అయితే జాతీయ పార్టీలకు స్థానం దొరక్కపోవచ్చునన్నది ఎంత వాస్తవమో, రెండు జాతీయ పార్టీలు బలోపేతమై పోరాడితే ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాలలో స్థాయి తగ్గిపోవడం కూడా అంతే వాస్తవమన్నారు.కేసీఆర్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. టీడీపీ, టీఆర్ఎస్ లు ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చాయని నేడు ఏపీలో ఉన్న పరిస్థితి భవిష్యత్ లో టీఆర్ఎస్ కు రాబోతుంది అని ఆమె పేర్కొన్నారు
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications