కొత్త డిప్యూటీ సీఎం - ఆయనకే ఛాన్స్, ఏం జరుగుతోంది..!?

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. దీంతో, తాజా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. గీత దాటవద్దని.. ఏ సమస్య ఉన్నా తమ వద్దకు రావాలని సూచించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేబినెట్ విస్తరణ.. నామినేటెడ్ పదవులు.. పీసీసీ కార్యవర్గం పై చర్చించనున్నారు. ఇదే సమయంలో రేవంత్ కేబినెట్ లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన పైన ఆసక్తి కర చర్చ మొదలైంది.

రేవంత్ మంత్రాంగం
తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో, ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం కావాలని రేవంత్ నిర్ణయించారు. అందులో ముందుగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు. కొందరు ఎమ్మెల్యేలు తమ వాదన వినిపించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కుల గణన నివేదిక.. తాజాగా అసెంబ్లీ తీర్మానాల గురించి పార్టీ అధి నాయకత్వానికి వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు గురించి వివరించనున్నారు.

Congress likely to give chance for BC leader as Deputy CM in Revanth s cabinet

బీసీ డిప్యూటీ సీఎం
ఇదే సమయంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిర్ణయాల దిశగా కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇవ్వగా, తాజాగా డిప్యూటీ సీఎం పదవి సైతం బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో భట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండేలా హైకమాండ్ నిర్ణయించింది. కాగా, బీసీల కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. బీజేపీ సైతం బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చింది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు సైతం బీసీకే ఇస్తారని సమాచారం. దీంతో, బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎంగా డిప్యూటీతో పాటుగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

ఢిల్లీ కేంద్రంగా
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ హైకమాండ్ తో చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి పైన తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ముదిరాజ్ వర్గానికి కేటాయిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలో కొత్తగా అవకాశం ఇచ్చే వారి విషయం లోనూ ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ కొత్త కార్యవర్గం సైతం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల పైన ఈ వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో హైకమాండ్ తో రేవంత్ చర్చలు కీలకంగా మారుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర నిర్ణయాలకు అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+