Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T Congress రెండో జాబితా సిద్దం - లిస్టులో ప్రముఖులు..!!

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీల హోరా హోరీ వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. తొలి జాబితా విడుదల చేసిన తరువాత కాంగ్రెస్ రెండో లిస్టు విడుదలకు కసరత్తు చేస్తోంది. ఈ రోజు 34 పేర్లతో జాబితా విడుదలకు రంగం సిద్దమైంది. పార్టీలో తిరిగి చేరుతున్న వారితో పాటుగా కొత్తగా చేరిన వారికి ఈ జాబితాతో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వామపక్ష పార్టీలకు సీట్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితా పైన పార్టీలో ఉత్కంఠ కనిపిస్తోంది.

కాంగ్రెస్ రెండో జాబితా : కాంగ్రెస్ రెండో జాబితా ఈ రోజు విడుదల కానుంది. పార్టీని వీడిన వారు తిరిగి రీ ఎంట్రీ ఇస్తుండటంతో వారికి సీట్ల కేటాయింపులో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో 34 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని తెలిపాయి.

Congress likely to release second list of contesting candidates in Telangana Elections today

ఇందులో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో.. మలి జాబితా తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

తుది కసరత్తు : ఇద్ద రు, ముగ్గురికిపైగా టికెట్లు ఆశిస్తున్న సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి.. నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. అవసరమైన వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బుజ్జగిస్తు న్నారు. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహు లు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

కా గా.. శుక్రవారం కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చెందిన సీట్లు మొత్తగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే, మొత్తం జాబితా కాకుండా 15 స్థానాల వరకు తుది జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు సమావేశంలో అభ్యర్దులపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Congress likely to release second list of contesting candidates in Telangana Elections today

సీనియర్లకు ప్రాధాన్యత : ఈ రోజు విడుదల చేసే జాబితాలో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తాండూరు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన రంగారెడ్డి డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి పేర్లు ఖరార అయినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కు మహేశ్వరం సీటు ఖరారు చేసారని సమాచారం. మాజీ ఎంపీ మధుయాష్కీకి ఆయన కోరుకున్న విధంగా ఎల్బీ నగర్ సీటు ఖాయంగా కనిపిస్తోంది.

సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నా..సీనియర్ నేత దామోదర్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. పటాన్ చెరులో నీలం మధుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాకలో పొంగులేటి సూచించిన అభ్యర్దుల వైపు మొగ్గు చూపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+