సీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని కోపతాపాలు పక్కకుపెట్టి వెళ్తారనుకుంటే మరింత విభేదాలు ముదురుతున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాత నాయకులు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పర్యటనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు.
ఏడాది పాలన సంబరాల పేరిట చేస్తున్న హడావుడిలో ఓ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభకు కాంగ్రెస్ నేత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సభ హన్మకొండ పట్టణంలో మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దూరంగా ఉన్నారు.

అంతేకాదు.. మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చినా కలవలేదు. దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ రోజు జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొనడం విశేషం.












Click it and Unblock the Notifications