వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా? .. రౌడీలకు గ్యాంగ్ లీడర్ కేసీఆర్ ?.. స్పీకర్ చూసి సిగ్గుపడుతున్నాం !! : కాంగ్రె

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బడ్జెట్ సమావేశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. రాజ్యాంగాన్ని ఉల్లంగించి ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాయింట్ ఆప్ ఆర్డర్‌కు మైక్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల గౌరవాన్ని సభాపతి పాటించడం లేదని .. ఏక పక్షంగా సభను నడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

Recommended Video

Telangana Budget : Challenges Ahead For TRS ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం | OneindiaTelugu
 అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా?

అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా?

శాసనసభ గౌరవాన్ని టీఆర్ఎస్ నేతలు మంటగటిపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీస్ అనుకుంటన్నారా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా సభను నడపడం సరికాదని అన్నారు. స్పీకర్ తీరును చూసి సిగ్గుపడుతున్నామని భట్టి వ్యాఖ్యానించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని మండిపడ్డారు . అప్రజాస్వామికంగా సభను నడుపుతున్నారని విమర్శించారు.

గూండాల‌కు కేసీఆర్ గ్యాంగ్ లీడ‌ర్‌

గూండాల‌కు కేసీఆర్ గ్యాంగ్ లీడ‌ర్‌

రాష్ట్రంలో గూండా, రౌడీల పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. వారికి సీఎం కేసీఆర్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి డెరెక్షన్‌లోనే సభాపతి బొమ్మలా నటిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులకు అసెంబ్లీలో మాట్లాడుకుండా గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన‌ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే కాపాడుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.

స్పీకర్ బండ్రోతులా మారుతున్నారా?

స్పీకర్ బండ్రోతులా మారుతున్నారా?

అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్షాలను చిన్నచూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. స్పీకర్ బండ్రోతులా మారుతున్నారా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా శాసనసభ స్పీకర్లు కూడా ఇలా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే.. పట్టింకోకుండా కూర్చుంది. తాము పాయింట్ ఆర్డర్ లేవనెత్తితే తమ మొహం వైపు కూడా స్పీకర్ చూడలేదని మండిపడ్డారు. తమ గొంతు నొక్కడం అంటే తమకు ఓట్లేసిన ప్రజలను అవమానించడమే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి జరిగిన అవమానంపై పోరాటం చేస్తామని తెలిపారు.

 కాంగ్రెస్ పార్టీకి అవ‌మానం

కాంగ్రెస్ పార్టీకి అవ‌మానం


అసెంబ్లీలో ఆర్టికల్ 176 (1) ప్రకారం తమకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తే అధికారం తమకుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. స్పీకర్ తమ గోడును పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభవాయిదా పడ్డ తర్వాత మూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే సభ ప్రొరోగ్ కావాల్సి ఉంది. కానీ ఐదు నెలలు అయినా అసెంబ్లీ ఎందుకు ప్రొరోగ్ కావలేదని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలా ఏ స్పీకర్ వ్యవహరించలేదని మండిపడ్డారు.

English summary
Telangana congress mlas serious on assembly speaker and boycott Harish rao budget speech
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X