కాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కొడంగల్ ఉపఎన్నికల్లో రేవంత్‌రెడ్డి విజయం సాధిస్తారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో తామంతా రేవంత్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Komatireddy brothers to join in Bjp ఉత్తమ్ ఎఫెక్ట్, బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్| Oneindia Telugu

అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని లాబీల్లో ప్రస్తుత రాజకీయాలపై నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తున్నారు. తాజా రాజకీయాలతో పాటు ఇతర పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తున్నారు. శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో కూడ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పాలనతో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అంశాలపై కూడ స్పందించారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సులభంగా 70 సీట్లు

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సులభంగా 70 సీట్లు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 50 సీట్లలో సులభంగా విజయం సాధిస్తోందని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.అయితే కొంచెం కష్టపడితే 60 నుండి 70 సీట్లను గెలుచుకొనే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

రేవంత్‌ దెబ్బ: ఆ లేఖ ఎక్కడుంది, చంద్రులకు చుక్కలేనా?

పాదయాత్రకు పార్టీ అనుమతి ఉండదు

పాదయాత్రకు పార్టీ అనుమతి ఉండదు

కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రలకు అధిష్టానం అనుమతి ఇవ్వరని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేస్తానని ప్రకటించినా ఆనాడు ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీగా ఉన్న గులాంనబి ఆజాద్‌ ఒప్పుకోలేదనే విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. తనతో పాటు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తానన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు.. పరోక్షంగా రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అనుమతి ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యక్తం చేశారు.

రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?

బస్సు యాత్ర చేసే అవకాశం

బస్సు యాత్ర చేసే అవకాశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బస్సు యాత్ర గానీ లేదంటే, అందరూ కలిసి పాదయాత్రకు పార్టీ నాయకత్వం అంగీకరిస్తోందో చూడాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్ర అంటే పార్టీ నాయకత్వం ఒప్పుకొనే పరిస్థితి ఉండదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకత్వం పనిచేస్తోందన్నారు.

రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

రేవంత్‌కు ప్రచారం చేస్తాం

రేవంత్‌కు ప్రచారం చేస్తాం

రేవంత్‌రెడ్డి రాజీనామా ఆమోదించి ఉపఎన్నికలు వస్తే కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధిస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. అయితే ఉప ఎన్నికలు వస్తే కొడంగల్ అసెంబ్లీ స్థానంలో తామంతా రేవంత్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

గుత్తాకు చెక్‌ పెట్టేందుకే కంచర్ల టిఆర్ఎస్‌లోకి

గుత్తాకు చెక్‌ పెట్టేందుకే కంచర్ల టిఆర్ఎస్‌లోకి

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కంచర్ల భూపాల్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని గుత్తా సుఖేందర్‌రెడ్డికి కేసీఆర్ ఝలక్ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు..టీఆర్ఎస్ లో గుత్తాది కక్కలేక మింగలేని పరిస్థితి అని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన చూస్తే రాజకీయాలపై వైరాగ్యం కలుగుతోందని, రాజకీయాలను వదిలేసి తన ట్రస్ట్ పనులను చూసుకోవాలనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress party will win 70 Assembly seats in 2019 elections said Nalgonda mla Komatireddy Venkat reddy. Komatireddy Venkat reddy chit chat with media on Friday at Assembly lobby.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి