చాపకింద నీరులా: గద్దర్, కోదండరాంతో కాంగ్రెస్ కీలక నేతల రహస్య భేటీ!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. వీరి మధ్య దాదాపు రెండు గంటలకుపైగా చర్చ జరిగినట్లుగా సమాచారం.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. వీరి మధ్య దాదాపు రెండు గంటలకుపైగా చర్చ జరిగినట్లుగా సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు నేరుగా రంగంలోకి దిగిన ఏఐసీసీ తెలంగాణ పీసీసీతో సంబంధం లేకుండా చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలన్న రాహుల్ విజ్ఞప్తిని మోసుకొచ్చిన ఆ పార్టీ పెద్దలు కోదండరాం, గద్దర్‌కు వివరించారని తెలుస్తోంది.

అయితే ఈ విజ్ఞప్తికి గద్దర్, కోదండరాం ఎలా స్పందించారన్న విషయం మాత్రం బయటికి పొక్కలేదు. మరోవైపు కుంతియా, కొప్పుల రాజు.. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను కూడా సంప్రదిస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నేరుగా ఏఐసీసీనే రంగంలోకి దిగడం గమనార్హం. తెలంగాణ పీసీసీతో సంబంధం లేకుండా తెర వెనుక ఆపరేషన్ చేస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకింత షాక్ గురయ్యారు.
నేరుగా ప్రజా సంఘాలు, జేఏసీ నేతలతోనే చర్చలు జరపాలన్న రాహుల్ విజ్ఞప్తితో ఆ పార్టీ దూతలు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే గద్దర్, కోదండరాంలతో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ విషయం ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ సీనియర్లకు కూడా తెలియకపోవడం గమనార్హం.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications