అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళి అర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కలగాపులగం చేయాలని చూస్తోన్న కేంద్రం

దళిత, బడుగు, బలహీన వర్గాల అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పురుషులతో సమానంగా అంబేద్కర్ మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించారని, మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

Constituency Formula Concern Southern States to Lose SC ST Women s Seats at Risk Revanth Reddy

దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి

మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని మొదట ప్రస్తావించినప్పటికీ.. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇప్పుడు దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని కేంద్రం చెబుతోందని అన్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుందని వివరించారు.

ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు

దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయని, ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారని రేనవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల పెంపుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, చెప్పిన మాటపై తమ ప్రభుత్వం నిలబడుతుందని పునరుద్ఘాటించారు రేవంత్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని గుర్తు చేశారు. కులగణన చేస్తామని చెప్పి, చేసి చూపించామని అన్నారు.

ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ

రాజ్యాంగంలో అంబేద్కర్ జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారని గుర్తు చేశారు. దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవులు, ఇతర హోదాలు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని కోరారాయన.

అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా

దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోన్నామని చెప్పారు. అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లను దళితులకు ఇచ్చామని, 67,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కల్పించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+