హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోజు తీరాక, అరబ్ దేశాల్లో యువతుల నరకం: షేక్ ఆట కట్టించిన ఎయిర్ హోస్టెస్

పెళ్లి పేరుతో బాలికలను వివాహం చేసుకొని, కొద్దిరోజులు ఇక్కడే వైవాహిక జీవితం అనంతరం వారిని అరబ్‌ దేశాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఎనిమిదిమంది షేక్‌లను దక్షిణ మండలం.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad marriage racket : 8 Arab sheikhs arrested మోజు తీరాక, అరబ్ దేశాల్లో యువతుల నరకం| Oneindia

హైదరాబాద్: పెళ్లి పేరుతో బాలికలను వివాహం చేసుకొని, కొద్దిరోజులు ఇక్కడే వైవాహిక జీవితం అనంతరం వారిని అరబ్‌ దేశాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఎనిమిదిమంది షేక్‌లను దక్షిణ మండలం పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

వీరికి సహకరించిన ముంబై ప్రధాన ఖాజీతో పాటు, మరో ఇద్దరు ఖాజీలు, ఐదుగురు బ్రోకర్లు, నలుగురు లాడ్జి యజమానులనూ అదుపులోకి తీసుకున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఛేదించి, 12 మంది బాలికలను కాపాడినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి బుధవారం తెలిపారు.

పాతబస్తీ బాలికలను పెళ్లి చేసుకునేందుకు పదిహేను రోజుల క్రితం ఐదుగురు ఒమన్‌ షేక్‌లు అల్‌ సల్‌హి తాలిబ్‌, మియాహీ హబీబ్‌ అలీ, నసీర్‌ ఖలీఫా, అల్‌-ఖాసీమీ హసన్‌, ఖతర్‌ వాసులు ఒమర్‌ మహ్మద్‌, హమద్‌ జబీర్‌, సఫేల్‌దిలన్‌ మహమ్మద్‌లు వేర్వేరుగా నగరానికి చేరుకున్నారు. లాడ్జిల్లో దిగారు.

రూ.10 లక్షల వరకు కాంట్రాక్ట్

రూ.10 లక్షల వరకు కాంట్రాక్ట్

బాలికలను పెళ్లి చేసుకుని తమ దేశాలకు తీసుకెళ్తామంటూ లాడ్జి యజమానులు, వివాహం జరిపించే ఖాజీలను సంప్రదించారు. రూ.3-10 లక్షల వరకూ నగదు ముట్టజెపుతామని, బాలికలను తీసుకురావాలని కోరారు. దీంతో వీరు స్థానిక దళారులతో కలిసి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, మొగల్‌పురా, శాలిబండ ప్రాంతాలకు చెందిన పేద బాలికలను లాడ్జిలకు తీసుకొచ్చి, షేక్‌లతో మాట్లాడిస్తున్నారు.

ఇలా వెలుగు చూసింది

ఇలా వెలుగు చూసింది

ఈ వ్యవహారం నచ్చని ఓ బాలిక ఐదురోజుల క్రితం పోలీసులకు విషయం చెప్పింది. దీంతో డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యాన మూడు బృందాలు రంగంలోకి దిగాయి. మంగళవారం ఓ లాడ్జిలో ఒమన్‌ షేక్‌ హబీబ్‌ అలీ పెళ్లి చేసుకుంటుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నాలుగు లాడ్జిల్లోనూ తనిఖీలు నిర్వహించి ఒమన్‌, ఖతర్‌ షేక్‌లు, బ్రోకర్లు, లాడ్జిల యజమానులను అరెస్ట్‌ చేశారు.

సంప్రదాయబద్దకంగా వివాహం అంటూ

సంప్రదాయబద్దకంగా వివాహం అంటూ

పాతబస్తీలో 20 మందికి పైగా బాల్య వివాహాలు, రెండో పెళ్లిళ్లు చేసే వారు ఉన్నారు. కొన్ని సందర్భాలలో సంప్రదాయబద్దంగా వివాహం జరిపించామంటూ రాయబార కార్యాలయాలకు ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు.

ఆగడాలు అన్నీ ఇన్నీకావు

ఆగడాలు అన్నీ ఇన్నీకావు

ఇదిలా ఉండగా, అరబ్ షేక్‌లు ఆగడాలు అన్నీ ఇన్నీ కావని చెబుతున్నారు. ఏటా వెయ్యికి పైగా పేద ముస్లిం బాలికలు, యువతులను ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటున్నట్టు అంచనా. సుడాన్‌, ఒమన్‌, సోమాలియా, దుబాయ్‌ తదితర దేశాలకు చెందిన కొందరు షేక్‌లు... టూర్ కోసమని హైదరాబాద్ వస్తున్నారు. నెల నుంచి ఐదు నెలలు కలిసుండే ఒప్పందంతో అమాయక బాలికలు, యువతులను పెళ్లి చేసుకుంటున్నారు. హోటల్‌, కిరాయి ఇళ్లలో కాపురంపెట్టి విలాసవంతంగా గడుపుతున్నారు.

మోజు తీరిన తర్వాత

మోజు తీరిన తర్వాత

మోజు తీరిన తర్వాత, వీసా గడువు ముగిశాక తలాక్‌ చెప్పి వెళ్లిపోతున్నారు. బార్కాస్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఏకంగా 17 ఒప్పంద పెళ్లిళ్లు అయ్యాయి. వీటితో విసిగిపోయి నిరుడు ఆమె ఆత్మహత్య చేసుకుంది.

డబ్బు ఎరగా వేసి లైంగికవాంఛ

డబ్బు ఎరగా వేసి లైంగికవాంఛ

ఏమీ తెలియని బాలికలను, పేదవారిని లక్ష్యంగా చేసుకొని యువతులతో కాంట్రాక్ట్ మ్యారేజీ చేసుకుంటున్నారు. ముసలి షేక్‌లు హైదరాబాద్ వస్తున్నారు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. డబ్బు ఎరగా వేసి చిన్నారులతో లైంగిక వాంచలు తీర్చుకుంటున్నారు.

అప్పుడే షేక్ ఆట కట్టించింది

అప్పుడే షేక్ ఆట కట్టించింది

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణాలను 1991లోనే ఎయిర్ హోస్టెస్ అమ్రిత అడ్డుకున్నారు. దుబాయ్‌ షేక్‌కు భార్యగా వెళుతున్న పదకొండేళ్ల అమీనాను రక్షించారు. ఆమె ఎయిర్ హోస్టెస్‌గా ఉన్న విమానంలో బాలిక ఏడుస్తుండటంతో ఆమె వద్దకు వెళ్లి అడగ్గా విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు అప్పగించి షేక్ ఆట కట్టించింది.

English summary
In a major crackdown on contract marriages racket involving old Arab sheikhs “marrying” local teenage Muslim girls, Hyderabad Police raided several guesthouses and lodges and arrested five Oman and three Qatar nationals, who were camping in the city to “marry” teenage girls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X