గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత: భవనంపైకెక్కిన నర్సులు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పొరుగుసేవల(కాంట్రాక్ట్) నర్సులు గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళన శనివారం మరింత తీవ్రం చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పొరుగుసేవల(కాంట్రాక్ట్) నర్సులు గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళన శనివారం మరింత తీవ్రం చేశారు. తమ సమస్యలు పరిష్కరించి ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి 10వ అంతస్తు భవనంపైకెక్కి నిరసన తెలిపారు.
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి యాజమాన్యం స్పందించే వరకు తాము భవనంపై నుంచి దిగేది లేదని తేల్చిచెప్పారు.

చాలీ చాలని జీతాలతో కాలం గడుపుతున్నామనీ, గతేడాది ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఆందోళనలో 220 మంది నర్సులు పాల్గొన్నారు. పలువురు నర్సులు ఆస్పత్రి ముందు బైఠాయించారు.












Click it and Unblock the Notifications