షాక్‌ ఇస్తాం: 6న అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామన్న విద్యుత్ కార్మికులు

Subscribe to Oneindia Telugu

వరంగల్‌: తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేకుంటే సర్కారుకు 'కరెంట్‌ షాక్‌' ఇస్తామని, డిసెంబర్‌ 6నఅర్ధరాత్రి నుంచి తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని విద్యుత కాం ట్రాక్టు కార్మికులు హెచ్చరించారు. డిసెంబర్‌ 5, 6 తేదీల్లో జరిగే నిరాహార దీక్ష, సమ్మె సన్నాహాక కార్యక్రమంలో భాగంగా టీఈటీయూఎఫ్‌ ఆధ్వర్యం లో హన్మకొండలో కాంట్రాక్టు కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు.

టీఈటీయూఎఫ్‌ చైర్మన్‌ పద్మారెడ్డి మాట్లాడుతూ.. జూన్‌ 15న సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు విద్యుత శాఖ మంత్రి 10 డిమాండ్లు అంగీకరించారన్నారు. కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాల చెల్లింపును 3 నెలల్లో ప్రారంభిస్తామన్న మంత్రి 5 నెలలు గడిచినా పట్టించుకోలేదన్నారు. ఈపీఎఫ్ జీపీఎఫ్‌గా మార్చడం, అదనపు పోస్టులు, చేరిన తేదీ నుంచి రెగ్యులరైజేషన, లైన ఇనస్పెక్టర్‌ పోస్టుల భర్తీ, కాంట్రాక్టు కార్మికులకు రూ.10 లక్షల బీమా తదితర డిమాండ్లను సైతం విద్యుత సంస్థ యాజమాన్యం అమలు చేయలేదన్నారు.

contract workers likely to strike

విద్యుత కార్మికులను నమ్మించి దగా చేసిన ప్రభుత్వం మూల్యం చెల్లించాలని హెచ్చరించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే కాంట్రాక్టు ఉద్యోగులకు రాబోయే రోజులు ప్రమాదకరంగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీఈటీయూఎఫ్‌ కన్వీనర్‌ ఇనుగాల శ్రీధర్‌ మాట్లాడుతూ.. విద్యుత కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే విద్యుత్ మంత్రి చైనా పర్యటనకు వెళ్లడమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఎలా ఉద్యమించాలో కేసీఆరే నేర్పారని, ఆయన స్ఫూర్తితో అదే పంథాలో వెళ్తామన్నారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు 'కరెంట్‌ షాక్‌' ఇవ్వాలని కో చైర్మెన కిరణ్‌ పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు పురుష ఉద్యోగులు నల్లచొక్కాలు, మహిళా ఉద్యోగులు నల్ల చీరెలు ధరించి వచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
contract workers likely to strike on December 6th.
Please Wait while comments are loading...