వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులపై ఐబీ అలర్ట్: పాతబస్తీలో కార్డాన్ సెర్చ్, 132మంది అనుమానితుల అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలోని పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత్‌లోకి ఆరుగురు ఉగ్రవాదులు వచ్చారని ఐబీకి సమాచారం అందింది. దీనిపై హైదరాబాద్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

దాదాపు 132 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి బర్మా, సౌదీ అరేబియా దేశాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ఎక్కడైనా షెల్డర్ పొందవచ్చుననే అనుమానంతో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఐబీ అలర్ట్‌తో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.

Cordon search in hyderabad, cops arrest 132 suspects

సౌదీ అరేబియా, బర్మాలకు చెందిన చాలామంది... తమ వద్ద పాస్ పోర్టులు లేకున్నప్పటికీ ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కంచన్ బాగ్ పిసఎస్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లోను కొందర్ని అదుపులోకి తీసుకున్నారు.

English summary
Cordon search in hyderabad, cops arrest 132 suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X