తెలంగాణలో కరోనా బాధితుల డైట్ లో మార్పులు ... మరింత బలవర్ధకంగా .. మెనూ ఇదే
తెలంగాణా ప్రభుత్వం కరోనా వైరస్ తో బాధ పడుతున్నవారికి చికిత్సతో పాటు సరైన పౌష్టిక ఆహారం కూడా ఇస్తున్న విషయం తెలిసిందే .కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటే ఒక్క మందులు మాత్రమే సరిపోవు. పౌష్టికాహారం కూడా ముఖ్యమే కాబట్టి ఇప్పటివరకు రోగులకు వారు కోరుకున్న విధంగా పలు పోషకాలతో కూడిన డైట్ అందించిన తెలంగాణా ప్రభుత్వం మెనూలో మార్పులు చేసింది . తెలంగాణా రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందటం లేదని, సరైన ఆహారం ఇవ్వటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలోప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది .
కరోనా బాధితులకు పోషకాలతో కూడిన ఆహారాన్నిఅందించాలని, కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణా ప్రభుత్వం మరోసారి సీరియస్‌గా ఆదేశించింది. దీంతో మరోమారు మెనూ మారింది. కరోనా పేషెంట్లకు అందిస్తున్న డైట్‌ను మార్చిన అధికారులు ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకున్నారు .

ఇక మెనూ చూస్తే ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, బోండా, ఉప్మా, పూరి, ఊతప్పంలలో ఏదో ఒక దాన్ని ఇస్తారు. దానితోపాటు పాలు కూడా ఇస్తారు. ఉదయం 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల మధ్య భోజనంలో అన్నంతో పాటుగా పప్పు, కోడిగుడ్డు, కూర, సాంబారు, పెరుగు, అరటిపండు, మినరల్ వాటర్ అందిస్తారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటలలోపు స్నాక్స్ తో పాటుగా కాఫీ లేదా టీ ఇస్తారు.వీటితో పాటు ఖర్జూరం, బాదం పప్పు, అంజీర కూడా ఇస్తారు. ఇక రాత్రి డిన్నర్ లో అన్నంతో పాటు కూర, కోడిగుడ్డు, పప్పు, సాంబార్, పెరుగు, అరటిపండు, మినరల్ వాటర్ అందిస్తారు.ఈ మెనూనే పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ఇస్తామని అధికారులు వెల్లడించారు.
-
హైడ్రా పవర్.. రూ. 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణ: గవర్నర్ -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications