బిర్యానీ ఇవ్వలేదని హోటల్‌పై కార్పోరేటర్ అనుచరుల దాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బిర్యానీ ఇవ్వలేదని హైద్రాబాద్ నాగోల్‌లోని ఓ హోటల్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. కార్పోరేటర్ అనుచరులమంటూ వారు ఈ దాడులకు పాల్పడ్డారు. బుదవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. దుండగుల దాడిలో హోటల్ యజమాని తీవ్రంగా గాయపడ్డాడు.

బుదవారం అర్దరాత్రి కొందరు దుండగులు నాగోల్‌లోని లక్కీ హోటల్‌లో బిర్యానీ ఇవ్వాలని అడిగారు. బిర్యానీ ఇవ్వకపోవడంతో నిందితులు హోటల్ యజమానిపై దాడి చేసి గాయపర్చారు. అయితే ఆ సమయంలో తాము కార్పోరేటర్ అనుచరులమని నిందితులు పేర్కొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Corporator's follwers attack Bakery owner in Hyderabad

హోటల్‌లోని ఫర్నీచర్ ను కూడ ధ్వంసం చేశారు. నానా హంగామా సృష్టించారు. దుండగుల దాడిలో గాయపడిన హోటల్ యజమానిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో హోటల్ యజమాని చికిత్స పొందుతున్నారు.

హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు 10 మంది దుండగులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గతంలో కూడ కార్పోరేటర్ అనుచరులమంటూ దాడులకు పాల్పడ్డారు. అంతేకాదు కొందరు కార్పోరేటర్లు కూడ దాడులకు పాల్పడిన ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Time and again GHMC Corporator's son's or their followers indulging in controversies. This time followers of Nagole Corporator Prashanth Goud allegedly attacked Lucky bakery owner Ali Raza for denying to give Biryani to them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి