సీఎం సహాయనిధిలో రూ.73 లక్షల స్కాం, 5గురి అరెస్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధిలో అక్రమాల పైన సిఐడీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ స్కాంలో ఐదుగురు మధ్యవర్తులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో కరీంనగర్‌కు చెందిన రాజేందర్, సింగిరెడ్డి సుభాష్ రెడ్డి, సాగర్, మురళీ ప్రసాద్, శ్రీనివాస్‌లు అరెస్టయ్యారు.
ముఖ్యమంత్రి సహాయనిధిలో భారీగా అక్రమాలు జరిగిన ఆరోపణలు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ అయ్యారు. దీనిని విచారిస్తున్నారు. 50 ఆసుపత్రుల పేరుతో 112 నకిలీ బిల్లులను నిందితులు వసూలు చేసుకున్నారు. మొత్తం రూ.73 లక్షలు కాజేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కాం కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాదులలో చోటు చేసుకుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి ట్రాఫిక్ డ్యూటీ
తాగి వాహనాలు నిడిపి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మందికి కోర్టు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కంట్రోల్ రూం సమీపంలో ప్రస్తుతం వీరు డ్యూటీని నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ వారి విధులను పర్యవేక్షిస్తున్నారు.
హోటల్‌ను సీజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు
నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న ఓ హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సీజ్ చేశారు. మురుగు డ్రైనేజీ నీరు కిచెన్‌లోకి వచ్చి కిచెన్ నిండిపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పరిశుభ్రత పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications