టిలో దేశంలోనే తొలి స్మార్ట్ మానుఫ్యాక్చరింగ్ హబ్!: వీకే సారస్వత్

హైదరాబాద్: దేశంలోనే తొలి స్మార్ట్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దీనికి కేంద్రం ఆమోదమే ఆలస్యమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కీన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న డిఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015 ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

తెలంగాణలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనపై కసరత్తు జరుగుతున్నదన్నారు. 2020 నాటికి రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని వివరించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలపై శిక్షణ పొందిన నిపుణులను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. నిపుణులకు అవసరమైన సాంకేతిక పరమైన శిక్షణనిచ్చేందుకు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థల సహకారం అవసరమని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు సాఫ్ట్‌వేర్ నిపుణులను ఆహ్వానిస్తున్నదని ఆయన వివరించారు. కొత్త ధోరణులకు అనుగుణంగా రక్షణ రంగ పరికరాల తయారీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని చెప్పారు.

దేశవ్యాప్తంగా 2024 నాటికి రక్షణ, వైమానిక పరికరాల (డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్) తయారీ పెట్టుబడుల ద్వారా 80 బిలియన్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సారస్వత్ తెలిపారు. తెలంగాణ నిర్దేశిత లక్ష్యం ప్రకారం 10 బిలియన్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పుణెలలో డిఫెన్స్ అండ్ ఎయిరో స్పేస్ తయారీ కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు.

ఎయిరోస్పేస్ మార్కెట్‌లో భారత్ మూడోస్థానంలో ఉందన్నారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా నినాదానికి అనుగుణంగా భవిష్యత్‌లో రక్షణ, వైమానిక పరిశ్రమలు పురోగతి సాధిస్తాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో త్వరితగతిన పరిశ్రమలు పెరగడంతోపాటు అభివృద్ధిలోనూ ముందడుగు వేయగలమని సారస్వత్ తెలిపారు.

డిఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

డిఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

దేశంలోనే తొలి స్మార్ట్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దీనికి కేంద్రం ఆమోదమే ఆలస్యమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు.

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కీన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న డిఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015 ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

తెలంగాణలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనపై కసరత్తు జరుగుతున్నదన్నారు.

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

2020 నాటికి రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని వివరించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర పరికరాలపై శిక్షణ పొందిన నిపుణులను సిద్ధం చేయాల్సి ఉందన్నారు.

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

నిపుణులకు అవసరమైన సాంకేతిక పరమైన శిక్షణనిచ్చేందుకు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థల సహకారం అవసరమని తెలిపారు.

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

ఫెన్స్ అండ్ ఏరోసైప్లై ఇండియా 2015

తెలంగాణ ప్రభుత్వం కూడా శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు సాఫ్ట్‌వేర్ నిపుణులను ఆహ్వానిస్తున్నదని ఆయన వివరించారు. కొత్త ధోరణులకు అనుగుణంగా రక్షణ రంగ పరికరాల తయారీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని చెప్పారు.

కాగా, రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమలపై తమ ప్రభుత్వం త్వరలో విధానాన్ని ప్రవేశ పెట్టున్నదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్‌లో డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+