మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం!
మంత్రి కొండా సురేఖపైన ప్రముఖ సినీ నటుడు నాగార్జున 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే అక్కినేని నాగార్జున పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖ రిప్లై
ఈ క్రమంలో తన పరువుకు నష్టం వాటిల్లిందని అక్కినేని నాగార్జున వందకోట్ల పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ పరువు నష్టం దావా కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్ పైన నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీట్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు.

అక్టోబర్ 30వ తేదీకి వాయిదా
ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే వాంగ్మూలాలను నమోదు చేసిన నాగార్జున, సాఖ్సులు
అయితే ఈ పిటిషన్ పైన ఇప్పటికే కోర్టు విచారణ జరిపింది. ఓపెన్ కోర్టులో నాగార్జునతో పాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లు తమ వాంగ్మూలాలను ఇప్పటికే న్యాయమూర్తి ముందు రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలను సైతం కోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ఈరోజు విచారణ జరగగా కోర్టు ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ తరఫున అడ్వకేట్ రిప్లై ఫైల్ చేశారు.
కోర్టుకు సమాధానం చెప్పటంలో తలమునకలైన కొండా సురేఖ
మరి ఈ పిటిషన్ బై విచారణను మళ్లీ 30 తేదీకి వాయిదా వేసిన కోర్టు ఈ పిటిషన్ పైన ఎటువంటి తీర్పును వెలువరిస్తుంది అన్నది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏది ఏమైనా కొండా సురేఖ మాత్రం ఇటు నాగార్జున పరువు నష్టం కేసు అటు కేటీఆర్ పరువు నష్టం దావాల నేపథ్యంలో కోర్టుకు సమాధానం చెప్పటంలో తలమునకలయ్యారు.












Click it and Unblock the Notifications