Liquor Scam: బోయిన్‍పల్లి అభిషేక్ రావు కస్టడీ పొడిగింపు.. ఎన్ని రోజులంటే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణ సాగుతోంది. ఈ కేసులో అరెస్టైన రాష్ట్రానికి చెందిన బోయిన్ పల్లి అభిషేక్ రావు కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే సమీర్ మహేంద్ర అనే వ్యక్తి అరెస్టయ్యాడు. ఇతని తర్వాత బోయిన్ పల్లి అభిషేక్ రావును సోమవారం అరెస్ట్ చేశారు. అభిషేక్‌రావు తొమ్మిది కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

అనూస్‌ ఒబేసిటీ అండ్‌ ఎలక్ట్రోలిసిస్, రాబిన్‌ డిస్టిలరీస్, అగస్టీ వెంచర్స్, ఎస్‌ఎస్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్, నియోవర్స్‌ రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్, వాల్యూ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జీనస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అనూస్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కంపెనీలలో అభిషేక్‌రావు డైరెక్టర్‌గా ఉన్నారు.

3 రోజుల కస్టడీ
అభిషేక్ రావుకు సోమవారం కోర్టు 3 రోజుల కస్టడీ విధించింది. బుధవారంతో కస్టడీ ముగియడంతో అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎంకే నాగ్ పాల్ ఆదేశాలు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని అరుణ్ పిళ్లైకు నోటీసులు ఇచ్చామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అతను తన కూతురు ఆస్పత్రిలో ఉందని... విచారణకు హాజరుకాలేనని చెప్పినట్లు వివరించారు.

 Court extends Boyin Pally Abhishek Raos custody for couple of days

అధికార పార్టీ
లిక్కర్‌ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన రాబిన్‌ డిస్టిలరీస్‌కు చెందిన రామచంద్రన్‌ పిళ్లైతో కలిసి అభిషేక్‌రావు వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది.అయితే లిక్కర్ స్కామ్ వ్యవహరం అటు ఢిల్లీతోపాటు ఇటు తెలంగాణ ప్రకంపనలు సృష్టింస్తుంది. అభిషేక్ రావు అధికార పార్టీకి చెందిన నేతలకు బంధువు. దీంతో స్కామ్ లో మరింత మంది ఉండొచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+