వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bharat Biotech: కోవాగ్జిన్ భవితవ్యమేంటీ: డబ్ల్యూహెచ్‌ఓ భేటీకి అటెండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ.. కీలక సమావేశానికి హాజరు కానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించే భేటీ అది. కోవాగ్జిన్ భవితవ్యం ఏమిటనేది ఈ సమావేశంలో తేలుతుంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరు, కోవిడ్‌పై దాని ప్రభావం ఆశించిన స్థాయిలో ఉండట్లేదంటూ కొన్ని దేశాల్లో అనుమానాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఈ సమావేశానికి హాజరు కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

ప్రచండ భానుడినే ఢీ కొట్టే సాహసం: దూసుకొస్తోన్న అతి భారీ తోకచుక్క: కళ్లు చెదిరే వేగంప్రచండ భానుడినే ఢీ కొట్టే సాహసం: దూసుకొస్తోన్న అతి భారీ తోకచుక్క: కళ్లు చెదిరే వేగం

ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం- కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే టీకాల జాబితాలో చేర్చడం. ఒక్కసారి ఈ లిస్టింగ్‌లో చోటు దక్కించుకోగలిగితే- ఇక పేద దేశాలకు డబ్ల్యూహెచ్ఓ స్వయంగా ఈ టీకాలను పంపిణీ చేస్తుంది. ఒకట్రెండు దశల్లో ఈ సమావేశం ఉంటుంది. ఇందులో భాగంగా- తొలి విడతలో ప్రీ-సబ్మిషన్ సమావేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ప్రతినిధులు కోవాగ్జిన్‌కు సంబంధించిన నాణ్యత, దాని ప్రభావం వంటి పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

Covaxin: Bharat Biotech to attend pre-submission meet for Emergency Use Listing by WHO today

దీనికోసం ప్రీ-సబ్మిషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ భారత్ బయోటెక్ చేసిన విజ్ఞప్తిని డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది. దీన్ని ఇవ్వాళ్టికి షెడ్యూల్ చేసింది. కాగా- కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తమకు అనుమతి లభించే అవకాశం ఉందంటూ భారత్ బయోటెక్ కిందటి నెలలోనే స్పష్టం చేసింది. ఇప్పటికే తాము 90 శాతం మేర డాక్యుమెంటేషన్‌ను డబ్ల్యూహెచ్ఓకు అందజేసినటలు తెలిపింది. కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించడం లాంఛనప్రాయమేనంటూ నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ ఇటీవలే వ్యాఖ్యానించారు.

Recommended Video

Hyderabad MMTS Trains Services Resumes From Today After 15 Months | SCR | Oneindia Telugu

English summary
Bharat Biotech, manufacturer of Covaxin likely to attend a pre-submission meeting with World Health Organization toda, a step that will push the vaccine producer closer to WHO emergency use listing (EUL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X