తెలంగాణలో కరోనా: కొత్తగా 405 కేసులు, 3మరణాలు -98.32శాతానికి రికవరీ రేటు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 84,262 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 405 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,52,785కు పెరిగాయి.
నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొవిడ్ బారినపడి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,845కు పెరిగింది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.3 శాతం కాగా, తెలంగాణలో అది 0.58 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ వ్యాధి నుంచి 577 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,41,847కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 97.45శాతం కాగా, తెలంగాణలో రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,093గా ఉంది.
కొత్త కేసులకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో అత్యధికంగా 67 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జగిత్యాల 18, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 3, కరీంనగర్ 32, ఖమ్మం 22, కొమరంభీం ఆసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 4, మహబూబాబాద్ 7, మంచిర్యాల 12, మెదక్ 1, మేడ్చల్ మల్కాజ్ గిరి 24, ములుగు 6, నాగర్ కర్నూలు 5, నల్గొండ 24, నారాయణపేట 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 21, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 19, సంగారెడ్డి 2, సిద్దిపేట 10, సూర్యాపేట 17, వికారాబాద్ 5, వనపర్తి 3, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 36, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. కాగా, నిర్మల్ జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా రాలేదు. ఇక,
తెలంగాణకు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఏపీ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 46,962 టెస్టులు చేయగా, కొత్తగా 909 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 13 మంది ప్రాణాలు కోల్పోగా, 1,543 మంది రికవర్ అయ్యారు. ఏపీలో మొత్తం కేసులు 19,94,606కు, రికవరీలు 19,63,728కు, మరణాలు 13660కి చేరాయి. ప్రస్తుతం అక్కడ 17,218 యాక్టివ్ కేసులున్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం నాటి లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 32,937 కేసులు, 417 మరణాలు నమోదయ్యాయి. తాజాగా 35,909 మంది కోలుకున్నారు. తాజా లెక్కలతో కలిపి మొత్త కేసులు 3,22,25,513కు, రికవరీలు 3,14,924కు, మరణాల సంఖ్య 4,31,342గా ఉంది. దేశంలో ఇప్పటిదాకా 54.58 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications