వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా ఆస్పత్రుల్లో కోవిడ్ కల్లోలం: గాంధీలో వైద్యులకు,ఎర్రగడ్డ ఆసుపత్రిలో పేషెంట్లకు కరోనా

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంత కరోనా కట్టడి చర్యలు చేపట్టినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఉన్న 57 మంది పేషెంట్లకు, తొమ్మిది మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

 ఎర్రగడ్డ ఆస్పత్రిలో మానసిక రోగులకు, వైద్యులకు కరోనా

ఎర్రగడ్డ ఆస్పత్రిలో మానసిక రోగులకు, వైద్యులకు కరోనా

కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నారు. మానసిక రోగులు కావడంతో కరోనా జాగ్రత్తల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమా శంకర్ వెల్లడించారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసోలేషన్ లో ఉంచామని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. మానసిక సమస్యలతో బాధపడే రోగులు ఉన్న మానసిక వైద్యశాలలో రోనా కలకలం సృష్టించడంతో ఇది ఎంతమందికి వ్యాప్తి చెందుతుందో అన్న భావన ఆసుపత్రి వర్గాల్లో వ్యక్తమవుతోంది.

గాంధీ ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా

గాంధీ ఆస్పత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా


ఇదిలా ఉంటే సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రిలో 70 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఇప్పటివరకూ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న 120 మంది వైద్య సిబ్బందికి కరోనా మహమ్మారి సోకింది. ఇక కరోనా సోకిన వారిలో డాక్టర్లు, హౌస్ సర్జన్ లు, ఎంబిబిఎస్ విద్యార్థులు ఉన్నారు. కరోనా మహమ్మారి సోకినవారిలో 38 మంది వైద్యులు 48 మంది పీజీ విద్యార్థులు, 35 మంది ఎం బి బి ఎస్ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీ ఉన్నారని సమాచారం.

ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి సిబ్బందికి చికిత్స

ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి సిబ్బందికి చికిత్స

మొత్తం గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 139 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. వీరిలో 35 మంది గర్భిణీలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కరోనా సోకిన వైద్య సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. వైద్యులకు కరోనా సోకటంతో ఆస్పత్రిలో సిబ్బంది కొరత నెలకొంది.

వైద్యులు కోవిడ్ బారిన పడడంతో పేషంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు

వైద్యులు కోవిడ్ బారిన పడడంతో పేషంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు


వరుసగా దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. వైద్యులు కొవిడ్ బారిన పడడంతో పేషంట్ల ట్రీట్మెంట్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పేషెంట్ల బంధువుల నుండి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే వైద్య సిబ్బంది కొరత ఉన్న ఆస్పత్రుల్లో వైద్యులకు కరోనా సోకటం ఇబ్బంది పెడుతుంది.

కరోనా కేసుల పెరుగుదలతో తెలంగాణా క్యాబినెట్ భేటీ .. పలు కీలక నిర్ణయాలు

కరోనా కేసుల పెరుగుదలతో తెలంగాణా క్యాబినెట్ భేటీ .. పలు కీలక నిర్ణయాలు


ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి పై దృష్టి సారించింది. అందులో భాగంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ భేటీలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వైద్యారోగ్యశాఖ సన్నద్ధతను మంత్రి హరీష్ రావు క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు మరిన్ని ఆంక్షల విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే జనవరి 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించి నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.

English summary
Corona creates turmoil in Telangana. Of the 57 patients and nine doctors at the erragadda Psychiatric Hospital, were diagnosed with corona. About 70 doctors and staff at Gandhi Hospital were infected with the corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X