
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులపై తెలంగాణా ప్రభుత్వ సర్వే; ఇప్పటివరకు 236మంది గుర్తింపు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. భారతదేశంలోనూ కరోనా మహమ్మారి లక్షలాది ప్రజల ప్రాణాలు తీసింది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ కాలం ఊహించని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎందరో తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు పోగొట్టుకున్న దారుణ పరిస్థితులను చూశాయి. ఇక తల్లి దండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పిల్లల సంఖ్య కోకొల్లలు. ఎక్కడ చూసినా మరణ మృదంగం మ్రోగింది.
Recommended Video
పడకేసిన
తెలంగాణా:
ఏ
తలుపు
తట్టినా
జ్వర
బాధితులే;
ఫీవర్
సర్వేలో
షాకింగ్
విషయాలు

కరోనా కల్లోలం .. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులు
ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా కల్లోలం కారణంగా తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన, తల్లిని లేదాతండ్రిని కోల్పోయిన పిల్లలను గుర్తించడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి రెండవ వేవ్ సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలయ్యారు. ఈ చిన్నారులను గుర్తించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనాధలైన చిన్నారుల సమాచారం సేకరిస్తున్నారు.

సర్వే చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం .. ఇప్పటివరకు 236 మంది అనాధలైన చిన్నారుల గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మొత్తం ఇప్పటివరకు 236 మంది పిల్లలు తల్లిని లేదా తండ్రిని, కొందరు తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయారని తేల్చింది. మూడవ వేవ్ సమయంలో మరణాల రేటు గణనీయంగా లేదు. అయితే ప్రభుత్వం ఇప్పటికీ కరోనా కారణంగా అనాథ పిల్లలను గుర్తించడానికి ఒక సర్వేను నిర్వహిస్తోంది. అనాథలైన పిల్లల బంధువులు నేరుగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి సమాచారం అందించవచ్చునని పేర్కొంది .

11 మందిని మాత్రమే సంక్షేమ హాస్టళ్లకు తరలింపు.. మిగతా వారంతా బంధువుల వద్దే
ఈ అనాథ పిల్లలను సంక్షేమ హాస్టళ్లకు తరలించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 236 మంది అనాథ పిల్లలను గుర్తించగా వారిలో 11 మందిని మాత్రమే సంక్షేమ హాస్టళ్లకు తరలించగా, మిగిలిన వారు బంధువుల వద్ద ఉంటున్నారు. అనాథ పిల్లలను వారి వయస్సు, ఆసక్తికి అనుగుణంగా హాస్టళ్లకు తరలిస్తున్నారు. వారి సంక్షేమానికి కావలసిన అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్వహిస్తున్న సర్వే ద్వారా అనాథలైన వారి వివరాలను సేకరించి, వారికి సంబంధించి ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రస్తుతం వారి బాధ్యతలు తీసుకున్న బంధువులకు తెలియజేస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ.. దేశ వ్యాప్తంగా దాదాపు 30 వేలకు పైగా చిన్నారులు అనాధలు
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం 2వ వేవ్ సమయంలో దాదాపు 30 వేలకు పైగా చిన్నారులు తల్లిదండ్రులకు దూరమై అనాధలుగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2021 ఆగస్టు నెలలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. కరోనాతో అనాథలైన చిన్నారులకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేపద్యంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ డేటాను అందించినట్లు గా తెలుస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా అత్యధికంగా తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులను అనాథలుగా మారిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, బీహార్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు నిలిచాయి.