వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజన్ ఉండాలి: బ్రెగ్జిట్‌పై హెచ్చరిక, భారత్‌పై ఎఫెక్ట్, 3 లక్షల కోట్లు హారతి

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రెగ్జిట్ పైన సిపిఐ నేత నారాయణ శుక్రవారం నాడు మాట్లాడారు. బ్రెగ్జిట్ పైన భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్రెగ్జిట్ ఫలితంగా మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ను కొనసాగించాలన్నారు.

బ్రెగ్జిట్ ఫలితాలు: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్, పరిస్థితి ఏంటి?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో నష్టం వస్తుందన్నారు. ఇక, కృష్ణా జలాల గురించి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చిస్తే గంటలో జల వివాదం కొలిక్కి వస్తుందన్నారు.

భారత్ పైన ఎఫెక్ట్

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని వెల్లడైన ప్రజా తీర్పు.. భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి సంపదను హరించి వేసింది. స్టాక్ మార్కెట్ సూచిక బీఎస్ఈ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోగా, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ.3.6 లక్షల కోట్లు హారతి అయింది.

గురువారం నాడు మార్కెట్ సెషన్ ముగిసే సమయానికి రూ. 1,01,38,218 కోట్లుగా బీఎస్ఈ మార్కెట్ కాప్, ఈ మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో రూ. 97,74,226 కోట్లకు దిగివచ్చింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 1011 పాయింట్లు నష్టపోయి 25,990 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మొత్తం 2,348 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 230 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

బ్రెగ్జిట్ తర్వాత డ్రెగ్జిట్, ఇగ్జిట్...

బ్రిటన్ ప్రజల చరిత్రాత్మక నిర్ణయం యూరోపియన్ యూనియన్ స్వరూపాన్నే మార్చేయనుందని బ్రిటన్ నేత, నైజిల్ పరాగే అన్నారు. బ్రిటన్ వాసుల మాదిరిగానే పలు యూనియన్ దేశాల ప్రజలు కూటమి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని, వారంతా ఇక ఉద్యమిస్తారన్నారు.

rajan

తమ వెంట నడిచే తొలి దేశంగా డెన్మార్క్ నిలుస్తుందని, ఇక అక్కడ 'డ్రెగ్జిట్' (డెన్మార్క్ ఎగ్జిట్) ప్రచారం ఊపందుకుంటుందన్నారు. ఆ తర్వాత ఇగ్జిట్ (ఇటలీ ఎగ్జిట్) తెరపైకి వస్తుందన్నారు. వీటితో పాటు స్వీడన్, ఆస్ట్రియాలు సైతం కూటమిని వీడుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈయూ మృత్యుశయ్య మీదకు చేరినట్టేనన్నారు. ఇకపై కూడా యూరప్ దేశాలన్నీ కలిసి వ్యాపారం చేసుకోవచ్చని, అభివృద్ధి దిశగా ఒకరి కొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగవచ్చన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా, స్నేహితులుగా కలిసే ఉందమన్నారు.

English summary
CPI Narayana responds on brexit on Friday and suggested to continue Rahuram Rajan as RBI governr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X