నోట్ల రద్దు, యాప్‌తో రూ.2000 నోటుపై స్పీచ్: ప్రధానికి షాక్, ఫిర్యాదుకు రెడీ
ప్రధాని మోడీ యాప్ పైన రూ.2000 నోటు పెట్టగానే ఆయన ప్రసంగం రావడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఐ నేత నారాయణ బుధవారం నాడు అన్నారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ యాప్ పైన రూ.2000 నోటు పెట్టగానే ఆయన ప్రసంగం రావడంపై సీపీఐ నేత నారాయణ బుధవారం నాడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని పైన తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
రూ.2000 నోట్ల రద్దు పైన కలిసి వచ్చే పార్టీలతో కలిసి పని చేస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఇబ్బందుల పైన ప్రధాని మోడీతో పాటు ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే డిమాండుతో ఆయన తిరుపతిలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రైతులకు ఇబ్బందులు: షబ్బీర్
నోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం అన్నారు. సామాన్య ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కడుతూ తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయంలోకి వెళ్లే లోపు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమైందో చెప్పాలన్నారు. ఇళ్ల నిర్మాణం పైన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీ ఏమయిందో చెప్పాలని నిలదీశారు. వాస్తు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications