పోలీసులా..? లేక.. నిర్వాసితులపై లాఠీఛార్జీ చేయడం ఏంటీ..? సీపీఐ నారాయణ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామవాసులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఘటనను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జి చేశారని తెలిపారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ పార్టీ కాపాడిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగేంత వరకు అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు ఏమయ్యాయని అడిగారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నారాయణ మండిపడ్డారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు సీపీఐ పోరాటం చేస్తుందని తెలిపారు. కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు గౌరవెల్లిలో కుర్చీ వేసుకుని కూర్చుని బాధితులకు న్యాయం చేయాలని నారాయణ సూచించారు. ఇప్పుడు బాధితుల గోడు పట్టించుకోరా అని అడిగారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు.. అలాంటి కీలకమైన నీటి కోసం ప్రాజెక్టులు కట్టారు.. కడుతున్నారు. బాధితుల సంగతి ఏంటీ అని అడుగుతున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాల్సి ఉంటుందని నారాయణ అన్నారు. కానీ వారికి పరిహారం ఇవ్వకపోవడం దారుణం అని అభిప్రాయపడ్డారు. వారి కోసం తమ పార్ట పోరాడుతుందని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications