తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్ ఇవే
తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టబోతున్నారని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్(CPS) ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ 72కి పైగా స్థానాల్లో గెలుస్తుందని సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. 43 శాతం మంది ఓటర్లు బీఆర్‌ఎస్ వెంట ఉన్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినప్పటికీ.. 36(+or-5) స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది.
మరోవైపు, బీజేపీ 1 నుంచి 3 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులు 9 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. 26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని సీపీఎస్ వెల్లడించింది. 11 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని తెలిపింది.

ఇక, మరో 29 నియోజకవర్గాల్లో 3000 కంటే తక్కువ మెజారిటీతోనే బీఆర్‌ఎస్ గెలుస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. అలాగే కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ గెలుస్తారని తెలిపింది. మరోవైపు, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తారని తెలిపింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గట్టి పోటీ ఎదుర్కొంటారని వివరించింది.
బీఆర్‌ఎస్ పార్టీ 68కి పైగా సీట్లలో గెలవబోతుందని పొలిటికల్ గ్రాఫ్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు 38, బీజేపీకి 5, ఇతరులు 8 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. బీఆర్ఎస్ పార్టీ 61 -68 స్థానాల్లో గెలుస్తుందని థర్డ్ విజన్ నాగన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. కాంగ్రెస్ 34-40, బీజేపీ 3-5, ఇతరులు 5-8 స్థానాల్లో గెలవబోతున్నారని అంచనా వేసింది. థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్‌ఎస్ 60-68 స్థానాల్లో గెలవనుంది. కాంగ్రెస్ 33-40, బీజేపీ 1-4 స్థానాల్లో, ఇతరులు 0-1 శాతం గెలుస్తుందని పేర్కొంది.
సీఎన్‌ఎన్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు:
బీఆర్ఎస్ 56
కాంగ్రెస్ 48
బీజేపీ 10
ఎంఐఎం 5
శ్రీఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ వివరాలు:
బీఆర్ఎస్ 58-63
కాంగ్రెస్ 48-51
బీజేపీ 7-8
ఇతరులు 7-9 స్థానాలు దక్కనున్నాయి.












Click it and Unblock the Notifications