కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు కూలీలు మృతి..
ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
కరీంనగర్: జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
చామనపల్లి గ్రామానికి చెందిన కూలీలు పత్తి ఏరే పని మీద వేరే గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ శివారు మల్కాపూర్ వంతెన వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది.

ఆటోలో ఉన్న ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications