కత్తి మహేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్: సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్ మాట్లాడినట్లు హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ కు చెందిన గడ్డం శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది జూన్ 29న ఓ టీవీ చానల్ లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొంటూ హైదరాబాద్ పోలీసులు కత్తి మహేశ్‌పై ఆరు నెలలపాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. అయితే, తాను విజయవాడకు షిఫ్ట్ అయిపోతున్నట్లు మహేశ్ ఇటీవల ప్రకటించారు.












Click it and Unblock the Notifications