రేవంత్ దేశద్రోహి.. ఎన్నికల్లో పోటీకి అనర్హుడు, మాల్యా వంటి ఆర్థిక నేరస్తుడు: బాల్క సుమన్
హైదరాబాద్: ఒక విజయ్ మాల్యా, ఒక చోటా షకీల్‌కు ఏమాత్రం తీసిపోని వ్యక్తి రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా భారత ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ ఓ దేశద్రోహి అన్నారు.
అలాంటి దేశద్రోహి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అన్నారు. ఎన్నికల కమిషన్‌ను తప్పుదారి పట్టించిన రేవంత్ రెడ్డిని పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్నారు.

కరడుగట్టిన ఆర్థిక నేరస్తుడు
కరడుగట్టిన ఆర్థిక నేరస్తుడు, భూకబ్జాకోరు అని ధ్వజమెత్తారు. రేంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులతో తెరాసకు సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ స్టూవర్టుపురం దొంగగా మారిందన్నారు. తెలంగాణ తులసివనంలో రేవంత్ గంజాయి మొక్క అన్నారు. రేవంత్ ఓ దేశద్రోహి, ఆర్థిక నేరస్తుడు అన్నారు. రేవంత్‌కు సమాజంలో ఉండే అర్హత లేదన్నారు. ఐటీ, భారత దేశాన్ని మోసం చేశారన్నారు.

చంద్రబాబు అండతో సంపాదన
చంద్రబాబు నాయుడు అండతో అక్రమంగా వేల కోట్లు సంపాదించి, ఆయన స్థాయికి ఎదిగాడన్నారు. ప్రజలు అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన భూకబ్జాలు, అక్రమాస్తులు బయటపడుతున్నాయన్నారు. వేల కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగాడో తెలియాలన్నారు. నేను కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నానని.. ఒక విజయ్ మాల్యా, ఒక ఛోటా షకీల్‌తో సమానమైన రేవంత్‌ను ఎలా సమర్థిస్తావని నిలదీశారు. చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తిని ఎలా సమర్థిస్తారన్నారు. రేవంత్ 19 షెల్ కంపెనీలు నడపడం న్యాయమా అన్నారు.

ఓటుకు నోటులో అడ్డంగా దొరికాడు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ దొంగలే అని బాల్క సుమన్ అన్నారు. సెటిల్మెంట్లు, భూకబ్జాలు, అన్యాయాలు, అడ్డదారులలో సంపాదించే వారు కాంగ్రెస్ నేతలు అన్నారు. తెరాస నీతిమాలిన రాజకీయాలు చేయదన్నారు. మూడేళ్ల క్రితం నోటుకు నోటుతో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ అన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కారులో నోట్లు కాలిపోయాయన్నారు. తెరాసకు ప్రజా మద్దతు ఉందని, తామే అధికారంలోకి వస్తామన్నారు.

మాల్యాతో సమానమైన మోసాలు, చరిత్ర మరింత తవ్వితీయాలి
మీకు అధికారం అప్పగిస్తే తెలంగాణను ఏపీ సీఎం చంద్రబాబు వద్ద, ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెడతారని ప్రజలు భావిస్తున్నారని బాల్క చెప్పారు. రేవంత్ అవినీతిచరిత్ర మరింత లోతుగా తవ్వి తీయాలన్నారు. రేవంత్.. దావూద్, విజయ్ మాల్యాతో సమానమైన నేరాలు చేశాడన్నారు. ఐటీ డిపార్టుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదని చెప్పారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications