వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో సీఎస్ కీలక భేటీ.! నైట్ కర్ఫ్యూపై చర్చ.!

|
Google Oneindia TeluguNews

ప్రగతి భవన్/హైదరాబాద్ : కరోనా సెకండ్ స్ట్రెయిన్ దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ఊహించని రీతిలో ప్రభత్వ ఆసుపత్రులకు కరోనా బాదితిలు క్యూ కడుతున్నారు. మరణాల రేటు కూడ అంతే స్థాయిలో ఉండడంతో మరింత ఆందోళనరకంగా పరిస్థితులు మారిపోయాయి. కాగా తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బీఆర్కే భవన్‎లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలను సోమేశ్ కుమార్ సేకరిస్తున్నారు.

అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో సీఎస్ భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనపై సీఎంతో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం.అంతేకాకుండా పంట కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండే జాగ్రత్తలపై సీఎం దృష్టికి సీఎస్ తీసుకెళ్లనున్నారు. దేవాలయాల వద్ద రద్దీ, ఆలయాల్లో కరోనా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో సీఎస్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.

CS key meeting with CM KCR for a while!Talk about night curfew!

రంజాన్ మాసం నేపథ్యంలో కరోనా కట్టడిపై అప్రతమత్తత ఉండేలా సూచనలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో భేటీ అనంతరం సీఎస్ కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఇవాళ శుక్రవారం సాయంత్రం వరకు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించాలా..? వద్దా..? అనేదానిపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.

English summary
CS will meet Chief Minister Chandrasekhar Rao. Information that the idea of ​​imposing a night curfew in the wake of the rising number of corona cases will be discussed with the CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X