Smita Sabarwal Vs Bala Latha: ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు..

పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై తీవ్ర దుమారం రేగుతోంది. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే అత్యంత కీలకమైన అఖిల భారత సర్వీసులలో వారికి కోటా ఎందుకని స్మితా ప్రశ్నించారు. "డిఫరెంట్లీ ఏబుల్డ్‌కి సకల గౌరవం. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. #AIS (IAS/IPS/IFoS) స్వభావం ఫీల్డ్-వర్క్, ఎక్కువ సమయం పన్ను విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం-దీనికి శారీరక దృఢత్వం అవసరం" అని స్మితా ట్వీట్ చేశారు.

దీనిపై తీవ్ర దమారం కొనసాగుతోంది. సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదని చెప్పారు. దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు అంటూ నీల దీశారు. ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? అంటూ బాల లత సవాల్ విసిరారు. 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. స్మితకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

CSB IAS Academy chief Balalatha responded to Smita Sabharwal s tweet

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్.కరుణ కూడా స్మితా ట్వీట్ పై స్పందించారు. వైకల్యం గురించి ఐఏఎస్ ఆఫీసర్ కు అవగాహన లేకుండా మాట్లాడుతన్నారని పేర్కొన్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తించాలన్నారు. దీనికి స్మితా రిప్లే ఇచ్చారు. తనకు ఉద్యోగ అవసరాల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలన్నారు. శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కూడా దీనిపై ట్వీట్ చేశారు.

ఇది చాలా దయనీయమై వినహాయింపు కలిగిన అభిప్రాయమన్నారు. బ్యూరోక్రాట్లు తమ పరిమితమైన ఆలోచనలను వారి ప్రత్యేకాధికారాలను ఎలా చూపిస్తున్నారనేదానికి ఇది నిదర్శనమన్నారు. పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+