వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

cyber crimes: ఫేక్ లోన్ యాప్స్ తో మోసపోతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

ఈ రోజుల్లో ఆర్థిక అవసరాల కోసం చాలామంది లోన్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు లోన్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇన్ స్టంట్ లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకోవద్దని సైబర్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా, చాలామంది వారిని ఆశ్రయించి చివరకు వేధింపులు భరించలేక లబోదిబోమంటున్నారు. ఇక లోన్ యాప్ ల పేరుతో విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందా లో ఫేక్ లోన్ యాప్ లు సైతం చలామణి అవుతున్నాయి. అయితే వాటిని గుర్తించటం ఎలా అన్నదానిపై సైబర్ పోలీసులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఫేక్ లోన్ యాప్స్ గుర్తించటానికి చిట్కాలు ఇవే

ఫేక్ లోన్ యాప్స్ గుర్తించటానికి చిట్కాలు ఇవే


ఫేక్ లోన్ యాప్ ను గుర్తించడం కోసం కొన్ని టిప్స్ ఉపయోగపడతాయని సైబర్ నిపుణులు సైతం సూచిస్తున్నారు. లోన్ కోసం ఏదైనా యాప్ ని డౌన్లోడ్ చేసుకునే సమయంలో యాప్ పేరు, దాని రేటింగ్, ఇతర వివరాలను కూడా పరిశీలించాలని సలహా ఇస్తున్నారు. ఆ యాప్ కు సంబంధించి ఎవరైనా ఏమైనా రివ్యూలు ఇచ్చారా ? ఇస్తే వాటిలో ఏమి పేర్కొన్నారు అనేది కూడా పరిశీలించాలని చెప్తున్నారు. అంతేకాదు ఆ యాప్ చిరునామా చూడాలని, ఒకవేళ అది ఫేక్ యాప్ అయితే పూర్తి వివరాలు ఇవ్వరని చెబుతున్నారు. అందులో ఇచ్చే సమాచారాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే దానిని బట్టి అది ఫేక్ యాప్ నా.. కాదా అన్నది అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.

యాప్ ఇన్ స్టాల్ చేసుకునే సమయంలో అవసరాన్ని మించి పర్మిషన్లు అడిగితే జాగ్రత్త

యాప్ ఇన్ స్టాల్ చేసుకునే సమయంలో అవసరాన్ని మించి పర్మిషన్లు అడిగితే జాగ్రత్త


ఇక ఇదే సమయంలో యాప్ ను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. అవసరానికి మించి ఎక్కువ పర్మిషన్లు అడుగుతుంటే, మీ మొబైల్ లో ఉన్న డేటా మొత్తాన్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంటే అటువంటి యాప్ లను డౌన్లోడ్ చేయకపోవడమే మంచిదని సైబర్ నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణం ఇచ్చేవారు వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఇలా రుణం గురించి మొత్తం పూర్తి సమాచారం ముందుగానే ఇవ్వాలని, రుణ ఒప్పందాలలో, రుణ మంజూరు పత్రంలో వడ్డీ రేటు, నియమ నిబంధనల అన్ని డీటెయిల్స్ ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో దానిని ఫేక్ యాప్ గా గుర్తించాలని చెబుతున్నారు.

కేవైసీ రూల్స్ పాటించకున్నా .. బీ కేర్ ఫుల్

కేవైసీ రూల్స్ పాటించకున్నా .. బీ కేర్ ఫుల్

ఒకవేళ లోన్ యాప్ కేవైసీ రూల్స్ పాటించకపోతే దానిని కూడా ఫేక్ యాప్ గా గుర్తించవచ్చు. కొన్ని యాప్ లు రుణదాతకు, రుణం తీసుకునే వారికి మధ్యవర్తిగా పనిచేస్తాయని అటువంటి వాటిని ఉపయోగించకుండా ఉంటేనే మంచిదని సలహా ఇస్తున్నారు. ఆ యాప్ ల ద్వారా కూడా మోసాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇన్ స్టంట్ లోన్ యాప్ లను ఉపయోగించడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఫేక్ లోన్ యాప్ లను నమ్మి మోసపోవద్దని సలహా ఇస్తున్నారు .

English summary
Getting scammed by fake loan apps? However, cyber experts say that loan apps should check the information thoroughly, and if they ask for unnecessary permissions, they should be careful even if they do not follow KYC rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X