భద్రతే లక్ష్యం: గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే (ఫోటోలు)
హైదరాబాద్: ఐటీ నిపుణుల భద్రతే ప్రధాన లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతున్న సైబరాబాద్ పోలీసులు తాజాగా సోమవారం పోలీస్ వాచ్‌టవర్‌ను, ఆడియో విజువల్ రికార్డింగ్ వాహనాన్ని ప్రారంభించారు. ఇప్పటికే షీ టీమ్స్, షీ క్యాబ్స్, షీ షటిల్స్, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతో సైబరాబాద్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే.
తాజా ఏర్పాట్లతో ఐటీ కారిడార్‌లో భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో ప్రధాన కూడలిలో ఈ టవర్ నిర్మించారు. ఈ టవర్‌ను ప్రారంభించిన అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సైబరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక సాఫ్ట్‌వేర్ సంస్థల్లో నాలుగు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు.

గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే
అందులో లక్ష మంది మహిళా ఉద్యోగులన్నారు. రానున్న రెండేళ్లలో మరో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఐటీ కార్యాలయాలతో పాటు ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే
సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్ ఏర్పాటు చేయడం మంచి పలితాలను ఇస్తుందని ఇందులో 200 కంపెనీలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు. ఈ కౌన్సిల్ సహాకారంతో విజువల్ పోలీసింగ్‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే
మహిళలకు షీ షటీల్స్, షీ క్యాబ్స్, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 150 సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలతో పాటు బయట సైతం పూర్తి భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే
వారాంతాల్లో వారిలో ఉత్సాహం నింపేందుకు రాహిగిరి, మారథాన్ వంటి కార్యక్రమాలకు సైబరాబాద్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లోని ప్రధాన కూడలి విప్రో జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ వాచ్ టవర్ నుంచి నిఘా పెంచడంతో పాటు మహిళల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించడం కోసం ఆడియో విజువల్ వ్యాన్ అందుబాటులోకి తెచ్చామన్నారు.

గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే
సిక్రోని ఫైనాన్షియల్ ఇండియా ఈవీపీ, చీఫ్ ఇన్పర్‌మేషన్ అధికారి క్యారల్ జ్యుల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఐటీకి అనువైందని, పూర్తి భద్రతతో కూడుకోవడంతో పాటు మంచి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

గచ్చిబౌలి విప్రో కూడలిలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇదే
టీఎస్‌ఐఐసీ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్ కార్యదర్శి భరత్ కుమార్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications