మాజీ మంత్రి రాజయ్య ఖాళీ చేసిన ఛాంబర్ డీఎస్‌కు ఇచ్చారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన టీఆర్ఎస్ నేత డి శ్రీనివాస్‌కు ఎట్టకేలకు సచివాలయంలో ఛాంబర్ కేటాయించారు. సలహాదారుగా నియమితులై పదిరోజులు కావస్తున్నప్పటికీ ఛాంబర్ కేటాయింపులో ఏర్పడిన ఆలస్యం వల్లనే ఆయనింకా బాధ్యతలను స్వీకరించలేదు.
అయితే తాజాగా సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో డీఎస్‌కు పేషీని కేటాయిస్తూ సాధారణ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసి, అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన టి. రాజయ్య ఇదే ఛాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు.

ఈరోజు ఛాంబర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం నాడు డి. శ్రీనివాస్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలను స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications