కాంగ్రెస్ లోకి డీఎస్ రీఎంట్రీ - భారీ ట్విస్ట్..!!

సీనియర్ పొలిటీషియన్ డీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ ఛైర్ లో గాంధీ భవన్ కు చేరుకున్నారు. దీనికి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎస్ తో పాటుగా ఆయన కుమారుడు సంజయ్ ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, డీఎస్ పేరుతో ఒక లేఖ విడుదల అయింది. తన కుమారులు ఇద్దరు ఒకరు కాంగ్రెస్ లో..మరొకరు బీజేపీలో తెలంగాణ కోసం పని చేస్తున్నారని..తాను మాత్రం కాంగ్రెస్ లో చేరటం లేదనేది లేఖ సారాంశం. కానీ, నిమిషాల్లో సీన్ మారిపోయింది.

డీ శ్రీనివాస్ తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం అనేక హోదాల్లో పని చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైఎస్సార్ తో కలిసి 2004, 2009 లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన మారిన రాజకీయ సమీకరణాల్లో నాటి టీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కానీ, టీఆర్ఎస్ లో డీఎస్ కొంత కాలానికే దూరమయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో సమావేవమయ్యారు. అప్పట్లోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది.

D Srinivas to re join in Congress, participated in Congress Satyagraha at Gandhi Bhavan

అదే సమయంలో టీపీసీసీ రేవంత్ సైతం డీఎస్ ను కలిసారు. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని ఆహ్వానించారు. డీఎస్ సానుకూలంగా స్పందించినా నిర్ణయం తీసుకోలేదు. డీఎస్ తో పాటుగా ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. మరో కుమారుడు బీజేపీలో ఎంపీగా ఉండటంతో..పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కలిసారు. బీజేపీకి ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం డీఎస్ అస్వస్థతకు గురయ్యారు. తిరిగి కోలుకున్న ఆయన ఈ రోజున వీల్ ఛైర్ లో గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఆ లేఖతో తనకు సంబంధం లేదని..తాను కాంగ్రెస్ లో చేరటానికి వచ్చానని స్పష్టం చేసారు.

దీంతో...తనకు తిరిగి సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందని చెప్పారు. డీఎస్ కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరిక పైన నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు విభేదించారు. వారితోనూ డీఎస్ మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారు. ఈ సమయంలోనే డీఎస్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. అయితే, డీఎస్ పేరిట విడుదలైన లేఖ ఎవరు విడుదల చేసారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. గాంధీ భవన్ లో జరిగే దీక్షలోనూ డీఎస్ పాల్గొనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+