అంతా అబద్దం!: హైదరాబాదులో బాబు ఇంటి దరఖాస్తుపై సోమేష్
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, దీని ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మెజార్టీ వచ్చే వార్డుల విభజన జరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ గురువారం ఆరోపించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం దానం మాట్లాడారు. జీహెచ్ఎంసీలోని వార్డులను అసంబంధంగా విభజించారన్నారు. వార్డుల పునర్విభజనలో తెరాస నేతలు చెబుతున్నట్టుగానే కమిషనర్ చేస్తున్నారన్నారు.
అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కమిషనర్‌ను తొలగించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాదును స్తంభింప చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

చంద్రబాబు దరఖాస్తు తిప్పి పంపాం: సోమేష్ కుమార్
హైదరాబాదులో చంద్రబాబు ఇంటి నిర్మాణ అనుమతికి, ఏపీ సచివాలయ ఆస్తిపన్ను బకాయిలకు సంబంధం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. సచివాలయానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించనందునే బాబు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదన్న వాదనలను కొట్టిపారేశారు.
గృహ నిర్మాణం కోసం చంద్రబాబు సమర్పించిన దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా లేదని, అందుకే నిరాకరించామన్నారు. పైగా ఆ దరఖాస్తు పెండింగులో పెట్టామని చెప్పడం అవాస్తవమన్నారు. తాము చంద్రబాబ దరఖాస్తును కొన్ని రోజుల్లోనే తిప్పి పంపామన్నారు.












Click it and Unblock the Notifications