దత్తన్న 'తెలంగాణ వెంకయ్య': ఆనాడు పిల్చినా వెళ్లని కేసీఆర్, నేడు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో దాదాపు తొలిసారి కేంద్రమంత్రి, బిజెపి నేత దత్తాత్రేయను గురువారం నాడు కలిశారు. దత్తాత్రేయ ఇంటికి వెళ్లారు. ఆయన పైన ప్రశంసలు కురిపించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కేంద్రమంత్రి ఉమాభారతిని కలవడానికి కేసీఆర్ వచ్చారు. అక్కడే ఉన్న ఉన్న బండారు దత్తాత్రేయ.. తన కార్యాలయానికి కూడా రావాలని కబురు పంపారు. అయితే కేసీఆర్ తర్వాత కలుద్దామంటూ వెళ్లిపోయారు.
కేసీఆర్ సోకులు!: తెరాస-బిజెపి మధ్య వాగ్యుద్ధం, ఫిరాయింపుల కోసమూనా?ఇప్పుడు మాత్రం స్వయంగా దత్తాత్రేయ ఇంటికి వెళ్లారు. ఆయన తమకు పెద్ద దిక్కంటూ అభివర్ణించారు. ఇటీవల వరంగల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితి షా.. సీఎం కేసీఆర్‌లపై ధ్వజమెత్తడంతో తెరాస నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు.

దీంతో ఇరుపార్టీల మధ్య వ్యవహారాలు బెడిసి కొట్టిందన్న భావం అందరిలో వ్యక్తమైంది. అయితే తాజా పరిణామం హస్తినలో చర్చనీయాంశమైంది. ఏపీ అభివృద్ధికి వెంకయ్య కృషి చేస్తున్నట్లు తెలంగాణ అభివృద్ధికి దత్తన్న కృషి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ఢిల్లీలో ఇక ఏ పని ఉన్నా ఆయన సహకారం తీసుకుంటామని టీఆర్‌ఎస్ ఎంపీలు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో దత్తన్న మనకు పెద్దన్న అని, ఆయనతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకుందామని దత్తాత్రేయతో సమన్వయంతో ఉండాలని, కేంద్రమంత్రులను కలవాలంటే దత్తన్న సహకారం తీసుకోవాలని ఢిల్లీలో పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలోనే సీఎం ఈ సూచన చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సహచర మంత్రులతో టచ్‌లో ఉంటూ, కావాల్సినవన్నీ చూస్తానని దత్తాత్రేయ చెప్పారని సమాచారం. కేంద్రమంత్రులను కలిసేటప్పుడు సమాచారమిస్తే తాను వెంట వస్తానని తెరాస ఎంపీలకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications