భారత్ బయోటెక్ మరో ముందడుగు: ముక్కు ద్వారా టీకా: ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 58,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఒకేసారి 60 వేలకు చేరువ కావడం కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1900ను దాటేశాయి.

భారత్ బయోటెక్ మరో పురోగతి..

భారత్ బయోటెక్ మరో పురోగతి..

ఈ పరిస్థితుల్లో ఈ మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశీయ ఫార్మాసూటికల్స్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న భారత్ బయోటెక్.. మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన ఈ టాప్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా.. ప్రస్తుతం దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో విస్తృతంగా వినియోగమౌతోంది. తాజాగా ఇందులో మరో పురోగతిని సాధించింది.

క్లినికల్ ట్రయల్స్ కోసం..

క్లినికల్ ట్రయల్స్ కోసం..


ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందీ సంస్థ. ఇంట్రానాసిల్ వ్యాక్సిన్‌ను డెవలప్ చేసింది. ఈ వ్యాక్సిన్‌ ప్రభావం, సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌‌ను నిర్వహించడానికి సన్నద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్స్ కమిటీ అనుమతులను మంజూరు చేసింది. ఇంట్రానాసిల్ వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసులపైనా క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇంట్రానాసిల్..

ఇంట్రానాసిల్..


డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆధీనంలో పని చేసే నిపుణుల కమిటీ ఇది. భారత్ బయోటెక్ ఇంట్రానాసిల్ వ్యాక్సిన్‌ బీబీవీ 154, బూస్టర్ డోసుల మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించడానికి సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. ఈ మేరకు డీసీజీఐకి సిఫారసు చేసింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రొటోకాల్స్‌ను తమకు అందజేయాల్సిందిగా ఎక్స్‌పర్ట్ కమిటీ.. భారత్ బయోటెక్ యాజమాన్యానికి సూచించింది.

యుక్త వయస్కుల వారికి..

యుక్త వయస్కుల వారికి..

ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల్లోపు యుక్త వయస్కుల వారి కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది భారత్ బయోటెక్. 15-18 వయస్సున్న వారి కోసం ఈ నెల 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ టీకానే వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థ కూడా దీనిపై ఇదివరకే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోంది.

 ఏ వ్యాక్సిన్ వేసుకున్నా..

ఏ వ్యాక్సిన్ వేసుకున్నా..

కాగా- ఇంట్రానాసిల్ వ్యాక్సిన్‌పై ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్‌లో సత్ఫలితాలు కనిపించాయని, దీన్ని బూస్టర్ డోసు లేదా అదనపు డోసుగా దీనిని అనుమతించాలంటూ కిందటి నెలలోనే భారత్ బయోటెక్ డీసీజీఐకి దరఖాస్తను అందజేసిన విషయం తెలిసిందే. మొదటి రెండు డోసులుగా కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ తీసుకున్న వారికి ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. అనుమతి లభించడంతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తుంది భారత్ బయోటెక్. దీనికోసం 5,000 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుంది.

Recommended Video

    Omicron Variant : Booster Vaccine Coming Soon! || Oneindia Telugu
    క్లినికల్ ట్రయల్స్ ఇలా..

    క్లినికల్ ట్రయల్స్ ఇలా..

    ఇందులో రెండు డోసుల చొప్పున కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఉన్నారు. వారిని 2,500 మంది చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తుంది. వారిపై ఇంట్రానాసిల్ ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడం, బూస్టర్ డోసులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. అనంతరం ఈ ఈ నివేదికను మళ్లీ డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు అందజేస్తుంది. ఆ ఫలితాలు, నివేదికలు సంతృప్తికరంగా ఉంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చేలా కేంద్రానికి డీసీజీఐ సిఫారసు చేస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+